కార్తీకదీపం ఎపిసోడ్ 1223: దీపవాళ్ల దగ్గరకు చేరుకున్న మోనిత కొడుకు..కోడలిగా సౌందర్య ఇంట్లో హడావిడి చేస్తున్న మోనిత

-

కార్తీకదీపం ఈరోజు ఎపిసోడ్ లో సౌందర్య, ఆనంద్ రావులు కార్తీక్ వాళ్ల గురించి బాధపడతూ ఉండగా..మోనిత స్కూటీతో ఇంట్లోకి వచ్చి కార్తీక్ ఎక్కడున్నావ్, మన బాబును ఎవరో కిడ్నాప్ చేశారు అంటూ హాల్ లో రౌండ్స్ వేస్తుంది. సౌందర్యవాళ్లు పైనుంచి చూస్తారు. కిందకు వస్తారు. మోనిత మీ కొడుకు మీకు దూరమయ్యాడని, నా కొడుకుని దూరం చేస్తారా అంటుంది. ఏం మాట్లాడుతున్నావ్ అంటే..నా బాబుని ఎవరో ఎత్తుకెళ్లారు పిలవండి ఆదిత్య ఎక్కడున్నాడు అంటే..బయటకు వెళ్లాడు అంటే..నాకు తెలుసు నా కొడుకును ఆదిత్యే ఎత్తుకెళ్లాడు అంటుంది మోనిత. ఎత్తుకెళ్లడం, దాచిపెట్టడం నీకు అలవాటు మాకు కాదు అంటుంది సౌందర్య. అయినా ఈ మెంటల్ది ఆదిత్యే నా కొడుకుని ఎత్తుకెళ్లి ఉంటాడు, ఇదంతా మీ ప్లాన్ యే అయిఉంటుంది..నా కొడుకుని ఎత్తుకెళ్తే ఏడుస్తా అని అనుకుంటున్నారా..నెవర్. నా కొడుకును ఎవరు ఎత్తుకెళ్లారో తెలిసేవరకూ నేను ఇక్కడ నుంచి కదలను, ఇక్కడే ఉంటాను అంటుంది.

మరోసీన్ లో శ్రీవల్లికి ఈసారి కూడా పుట్టినబిడ్డ చనిపోతుంది. ఏడుస్తూ ఉంటుంది. అబ్బ ట్విస్ట్ అదిరిందిగా..మోనిత కొడుకుని శ్రీవల్లి భర్త కిడ్నాప్ చేశాడు. ఆ బిడ్డను శ్రీవల్లికి ఇచ్చి..ఈ హాస్పటల్ లోనే ఎవరో బిడ్డను కనేసి చనిపోయారట అని మోనిత బిడ్డను ఇస్తాడు.

ఆరోజు రాత్రి కార్తీక్ వాళ్లు కింద కుర్చోని భోజనం చేస్తుంటారు. కార్తీక్ గతంలో అందరూ డైనింగ్ టేబుల్ మీద కుర్చోని తినే సీన్ తలుచుకుంటాడు. ఇంతలో రుద్రాణి వస్తుంది. ఇల్లు సౌకర్యంగా ఉందామ్మా అంటుంది. రండిరండి ఇలా వచ్చారేంటి, కబురు చేస్తే నేనే వచ్చేదాన్ని కదండి అంటుంది దీప. వచ్చేలా చేశావ్ మరి నేను ఏం చేయను అని ఇల్లాంతా చూస్తుంది. టైం బాలేక వచ్చాను అన్నావ్..వంటసామాగ్రి చాలానే ఉన్నాయి నీవేనా అంటే..బయటవాళ్ల వస్తువులు ఉన్నాయని నేనే తీసుకువచ్చాను అండి అని కార్తీక్ అంటాడు. ఆ మాట నాకు చెప్పాలికదా..ిది రుద్రాణి సామ్రాజ్యం అని తెలుసుకదా అంటుంది. నేనే వచ్చి మీకు చెప్పాలి అనుకున్నాను అండి అంటుంది దీప. రుద్రాణి కోపంతో అన్నం గిన్నెను కాలుతో తన్నుతుంది. కార్తీక్ కోపంగా…మీరేం మనుషులండి..పిల్లలు తింటున్నారు అని తెలిసి కూడా కాలుతో తంతారా అంటే..నా మాట వినకపోతే నేను అంతే..గిన్నెలు అయినా మనుషులైనా కాలితోనే సమాధానం చెప్తాను అంటుంది. రుద్రాణి సమ్రాజ్యం ఇది అంటుంది. కార్తీక్ ఏం మనుషులండి అని చేయి చూపిస్తాడు. రుద్రాణి కార్తీక్ ను నెడుతుంది. అంతే. దీప జెట్ స్పీడ్ లో వచ్చి రుద్రాణి చెంప పగలకొడుతుంది. మర్యాద మర్యాద నేర్చుకోండి, ఆయన ఎవరు అనుకుంటున్నారు, మీ లాంటి వాళ్లు వందమంది చేతులెత్తి మొక్కుతారు తెలుసా అంటుంది. దీప ఆగు అంటే..మీరు ఆగండి చెప్పనివ్వండి, నన్ను ఏమన్నా ఊరుకుంటాను కానీ. మిమ్మల్ని ఏమైనా అంటే ఊరుకోను అంటుంది. అంత గొప్పోడా..అలాంటప్పుడు ఇక్కడకు ఎందుకు వచ్చినట్లో అంటుంది రుద్రాణి. అదినీకు అనవసరం అంటుంది దీప. ఇంత గొప్పగా చెప్తున్నావ్ అంటే..ఏదో పెద్దకథే ఉందనమాట..నేను బియ్యం ఇస్తాను అంటే..నువ్వు వద్దన్నప్పుడే నాకు డౌట్ వచ్చింది అంటుంది రుద్రాణి.

మీకు ఏ డౌట్ వచ్చినా భయపడేది లేదు..అప్పుడు ఈ ఇల్లు మీది అనుకున్నాను అని దీప అంటే..అప్పుడు కాదు ఇప్పుడు కూడా ఇది నా ఇల్లే..ఆ కోటేష్ నా దగ్గర ఈ ఇల్లు తాకట్టు పెట్టి రెండులక్షలు తీసుకున్నాడు. పైసా కూడా తిరిగి ఇవ్వలేదు. ఇంట్లోంచి వెళ్లగొట్టి సామాన్లు అన్ని విసిరేశాను, మీరు వచ్చారు, ఆ విసిరేసినవి మళ్లీ తెచ్చారు , తప్పు చేశారు, నన్ను ఎదిరించి మొదటి తప్పు చేశారు, నన్ను కొట్టి పెద్దతప్పు చేశావ్ అంటుంది రుద్రాణి. మా వారిని ఇంకొక్క మాట అంటే..మళ్లీ కొడతాను, నేను తప్పు చేయలేదు అంటుంది దీప. ఇన్ని సంవత్సరాలలో నా ముందు ఇలా మాట్లాడిన వాళ్లే లేరు, నేను ఉండనివ్వను అంటుంది, చూడపోతే నీకు జాలిగుండెలా ఉంది అంటుంది. తప్పేంటి జాలిపడితే అని దీప గంభీరంగా అంటుంది. అయితే వాడు తీసుకున్న అసలు వడ్డీ కలిపి 3 లక్షల 20 వేలు కట్టి ఇళ్లు విడిపించుకోండి అంటుంది రుద్రాణి. ఏంటి మాట్లాడరు, లక్షలు అనేసరికి జాలి జాంమట్టు పారిపోయిందా అంటే..అవసరమైతే ఇస్తాం అంటాడు కార్తీక్. చూద్దాం..ఇంటిబయట నావాళ్లు ఉన్నారు, చిటికేస్తే మిమ్మన్ని ఊరుదాటించటం, ఈ లోకాన్నే దాటించటం నాకు పెద్దకష్టమేం కాదు అంటుంది రుద్రాణి. మీకు భయపడేవాళ్లు ఎవరూ లేరు ఇక్కడ, ఈ ఇంటికి అద్దె ఇద్దాం అనుకున్నాను..ఇది మీ ఇల్లే కానప్పుడు అది కూడా అవసరంలేదని దీప అంటుంది. నా అంచనాలకే మించి ఉన్నావు నువ్వు, ఎవరికి ఎలా బుద్ది చెప్పాలో నాకు బాగా తెలుసు అని వెళ్తూ మళ్లీ వెనక్కు వచ్చి పిల్లలు బాగున్నారా అమ్మా, ఈ సారి వచ్చినప్పుడు చాకెట్లు తెస్తానమ్మా అని..డబ్బులు గుర్తుచేసి..చెంపమీద చేయిపెట్టుకుని..గుర్తుపెట్టుకుంటాను, ఇంతకు డబుల్ ఇస్తాను అని వెళ్తుంది.

కట్ చేస్తే తెల్లారి ఉదయం..కార్తీక్ ఇంట్లో మోనిత పూజచేస్తూ..సీరియల్ సాంగ్ పాడుతుంది. అందరూ షాకై చూస్తారు. వాళ్లకు శుభోదయం చెప్తుంది మోనిత. హరతి తీసుకోండి అని సౌందర్య, ఆనంద్ రావులకు ఇస్తే వాళ్లు చీప్ గా చూస్తారు. పాటబాగుందా..ఈ మధ్య ప్రాక్టీస్ లేక శృతితప్పింది అంటుంది. ఎపిసోడ్ అయిపోతుంది.

తరువాయభాగంలో శ్రీవల్లి వాళ్లు బిడ్డను తీసుకుని ఇంటికి వస్తారు. దీప హారతి ఇచ్చి ఇంట్లోకి పిలుస్తుంది. కార్తీక్ చూసి రోజుల బిడ్డలా లేడే అంటే..దీప కూడా నాకూ అదే అనిపించింది..కోటేష్ నిజం చెప్పు ఈ బిడ్డ ఎవరిది అంటుంది. మరోసీన్ లో మోనిత కొడుకును ఎవరో ఎత్తుకెళ్లారు..పుట్టెడు దుఖంలో ఉన్నాను, నాకు మీరే న్యాయం చేయాలి అంటుంది. తిరిగితిరిగి మోనిత కోడుకు కార్తీక్ వాళ్ల దగ్గరకు చేరటం మాత్రం సూపర్ ట్విస్ట్.

Read more RELATED
Recommended to you

Latest news