తిరుమలలో వసతి సత్రాల నిర్మాణానికి భూమి పూజా చేసిన ఏపీ, కర్నాటక ముఖ్యమంత్రులు

-

శ్రీవారిని దర్శించుకోవడానికి ఎక్కడెక్కడినుంచో దాదాపు కొన్ని వేలల్లో భక్తులు తిరుమలకి వస్తారు. అయితే వచ్చిన భక్తులు అందరికి వసతి గృహాలు ఉండేలాగా నూతన వసతి గృహానికి ఈరోజు స్వీకారం చుట్టారు. తిరుమలలో దాదాపు 200 కోట్ల రూపాయల వ్యయంతో వసతి సత్రాల నిర్మాణానికి ఈ రోజు భూమి పూజ నిర్వహించారు.ఈ భూమి పూజ కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన జగన్ మోహన్ రెడ్డి అలాగే కర్ణాటక రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన బి. ఎస్. యడ్యూరప్ప చేతుల మీదగా ఈరోజు ఉదయం భూమి పూజ జరిగింది. తిరుమలలోని కర్ణాటక చారిటీస్‌కు 7.05 ఎకరాల భూమిని 50 సంవత్సరాల కాల పరిమితికి 2008లో టీటీడీ లీజుకు ఇచ్చింది.అయితే ఈ స్థలంలో టీటీడీ నిబంధనల మేరకు రూ.200 కోట్లతో నూతన వసతి సముదాయాల నిర్మాణం చేపట్టడానికి జూలైలో కర్ణాటక ప్రభుత్వం, టీటీడీ మధ్య ఒప్పదం కుదిరింది.

 

ఇకపోతే ఈ వసతి గృహంలో సుమారు 242 యాత్రికులకు వసతి గదులు, 32 సూట్ రూములు, 12 డార్మెటరీలు, ఒక కల్యాణమండపం,ఒక డైనింగ్ హాల్ ఉండేలాగా పుష్కరిణిని పునరుద్ధరిస్తారు. టీటీడీ ఈ నిర్మాణాలు పూర్తి చేసి కర్ణాటక ప్రభుత్వానికి అప్పగిస్తుంది.ఈ భూమి పూజలో ఏపీ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రులతో పాటుగా పలువురు ప్రముఖులు,ఇరు రాష్ట్రాల ఎంపీ, ఎమ్మెల్యే లు,టిటిడి కార్యకర్తలు పాల్గొన్నట్లు తెలుస్తుంది..

Read more RELATED
Recommended to you

Latest news