ఏపీ ప్రజలకు అలెర్ట్. ఏపీలో కొత్త పంచాయతీ భవన నిర్మాణాలకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. సొంత భవనాలు లేని 417 గ్రామపంచాయతీ భవనాల నిర్మాణానికి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఒక్కో భవనాన్ని రూ. 32 లక్షలతో నిర్మించేందుకు అనుమతి ఇస్తూ జీవో జారీ చేసింది.

ఇందులో రాష్ట్రీయ గ్రామ స్వరాజ్య అభియాన్ నుంచి రూ. 25 లక్షలు, ఉపాధి హామీ పథకం కింద రూ. 7 లక్షల నిధులను ఉపయోగించుకోవాలని పంచాయతీ రాజ్, గ్రామీణ అభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్ కుమార్ పేరుతో ఉత్తర్వులు జారీ అయ్యాయి. మరోవైపు అమరావతిలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల కోసం కొత్తగా భవనాలను నిర్మిస్తున్నారు. అందులో ఒక భవనం పూర్తయింది. ఈ భవనాలకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు ఇప్పుడు ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటున్నాయి.