Breaking : ముగిసిన ఏపీ అసెంబ్లీ సమావేశాలు

-

ఏపీ అసెంబ్లీ సమావేశాలు నేటితో ముగిశాయి. 15వ శాసన సభ 11వ సమావేశం ముగిసింది. సెప్టెంబరు 21 నుండి 27 వరకూ 5 రోజుల పాటు సమావేశాలు కొనసాగాయి. సభలో పలు కీలక బిల్లులు ఆమోదం పొందాయి. ఇక శాసన మండలిలో పలు కీలక బిల్లులు ఆమోదం పొందాయి. ఆంధ్ర ప్రదేశ్ సివిల్ కోర్ట్స్ (అమెండ్మెంట్) బిల్లు-2023, ఆంధ్రప్రదేశ్ గ్యారెంటీ పెన్షన్ సిస్టమ్ బిల్లు- 2023, ఆంధ్రప్రదేశ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ టాక్స్ సెకండ్ అమెండ్మెంట్ బిల్లు -2023, ఆంధ్రప్రదేశ్ రెగ్యులైజేషన్ ఆఫ్ సర్వీసెస్ ఆఫ్ కాంట్రాక్ట్ ఎంప్లాయిస్ బిల్లు-2023, ఆంధ్ర ప్రదేశ్ అప్రాప్రియేషన్ నెంబర్ -3 బిల్లు -2023 ఆమోదం పొందాయి.

Andhra Pradesh Assembly passes nine bills, including AP Private  Universities Amendment Bill

చంద్రబాబుకు రెండు కోర్టుల్లో చుక్కెదురు, బాబు పిటిషన్‌పై విచారణ అక్టోబర్ 3కు వాయిదా వేసిన సుప్రీంకోర్టు, బెయిల్, కస్టడీ పిటిషన్ల విచారణను అక్టోబర్ 5కి వాయిదా వేసిన ఏసీబీ కోర్టుఏపీ అసెంబ్లీ చివరి రోజు సమావేశాల్లో కాంట్రాక్ట్ ఉద్యోగుల రెగ్యులరైజేషన్ బిల్లుకు సభ ఆమోదం తెలపగా, జీపీఎస్ బిల్లును మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి సభలో ప్రవేశపెట్టారు. ఈ బిల్లు సభ ఆమోదం పొందింది.దీని ద్వారా ప్రభుత్వ ఉద్యోగులు రిటైర్‌ అయ్యే నాటికి ఉన్న బేసిక్‌ పేలో 50 శాతం గ్యారెంటీ పెన్షన్‌ ఇవ్వనున్నట్లు మంత్రి బుగ్గన తెలిపారు. పింఛనుదారు మరణిస్తే భార్య లేదా భర్తకు ఆ పింఛన్‌లో 60 శాతం గ్యారెంటీ పొందవచ్చాన్నారు. ప్రభుత్వ ఉద్యోగి వార్షిక ఆదాయంలో తగ్గుదల ఉంటే నెలకు రూ.10 వేలు కనీస పింఛన్ భరోసా కల్పిస్తామన్నారు. రిటైర్డ్‌ ఉద్యోగులకు హెల్త్‌ ఇన్సూరెన్స్‌ స్కీమ్ అమలుచేస్తామన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news