BREAKING NEWS: ప్రత్యేక జిల్లా కోసం అవసరమైతే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా- నందమూరి బాలకృష్ణ

-

హిందూపురాన్ని జిల్లా కేంద్రంగా ప్రకటించాలని… దీని కోసం అవసరమైతే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని సంచలన వ్యాఖ్యలు చేశారు. హిందుపురాన్ని జిల్లా కేంద్రంగా చేస్తామని ప్రగల్బాలు పలికిన వైసీపీ కౌన్సిలర్లు ఇప్పుడు ఎక్కడికి పోయారని ప్రశ్నించారు. హేయమైన, నీచమైన రాజకీయాలను చూడలేదని ఆయన విమర్శించారు. హిందూ పురాన్ని జిల్లా కేంద్రంగా చేయడానికి అన్ని వసతులు ఉన్నాయని ఆయన అన్నారు. హిందుపురాన్ని జిల్లా కేంద్రంగా ప్రకటించి.. సత్యసాయి జిల్లాగా పేరుపెట్టాలని డిమాండ్ చేశారు. అర్థరాత్రి హడావుడిగా జిల్లాలను ప్రకటిస్తూ జీవో జారీ చేశారని మండిపడ్డారు. బాలకృష్ణ కనిపించడం లేదని వైసీపీ నాయకులు అంటుంటారు.. ప్రత్యక్షంగా జిల్లా సాధన కోసం పోరాడుతున్నాను.. మీరే కనిపించడం లేదని వైసీపీ నేతలను విమర్శించారు. ఎన్టీఆర్ జిల్లా అని ప్రకటించారని.. ఏదో ఆశించి, ప్రజలను మభ్యపెట్టేందుకు ఎన్టీఆర్ జిల్లా అని ప్రకటిస్తే సరిపోదని ఆయన అన్నారు. కడప జిల్లాకు వైఎస్సార్ జిల్లా అని పేరు పెడితే టీడీపీ కొనసాగించిందని బాలకృష్ణ గుర్తు చేశారు.

 

 

Read more RELATED
Recommended to you

Latest news