ఏపీ బీజేపీ నేతలకు అమిత్ షా దిశానిర్థేశం…

-

సదరన్ జోనల్ కౌన్సిల్ మీటింగ్ పర్యటనలో భాగంగా ఏపీకి వచ్చిన కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, ఆంధ్రప్రదేశ్ బీజేపీ నేతలకు దిశానిర్ధేశం చేశారు. రానున్న రోజుల్లో ఏపీలో బలపడేందుకు పలు సూచనలు చేశారు. సమావేశం అనంతరం ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు మీడియాతో మాట్లాడారు. ఏపీలో ప్రభుత్వ వ్యతిరేఖ వాతావరణం ఉందని.. 2024లో అధికారం దిశగా అడుగులు వేయాలని అమిత్ షా దిశానిర్ధేశం చేశారని అన్నారు. రాష్ట్రాన్ని అభివ్రుద్ది దిశగా తీసుకెళ్లేందుకు బీజేపీ పని చేస్తుందన్నారు సోము వీర్రాజు. ఏపీలో గ్రామీణాభివ్రుద్దికి సహకారమందిస్తామని అమిత్ షా చెప్పినట్లు వెల్లడించారు.

మరో నేత పురుంధీశ్వరీ మాట్లాడుతూ… ఏపీలో ప్రజావ్యతిరేఖ విధానాలపై బీజేపీ పోరాడుతుందన్నారు. బీజేపీ ప్రజావాణి కావాలని అమిత్ షా అన్నారని పేర్కొంది. ఏపీలో బీజేపీ బలోపేతం, తాజా రాజకీయ పరిస్థితులపై చర్చించామని వెల్లడించారు. ఏపీలో విభజన చట్టంలోని అంశాలపై అమిత్ షాతో చర్చించామన్నారు. విభజన బిల్లులో 80 శాతం వరకు హామీలను కేంద్రం నెరవేర్చిందన్నారు. ఏపీలో ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికలు జరగడం లేదు. దీనిపై పోరాడుతామని పురుంధీశ్వరి అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news