అమరావతి: ఏపీ సీఎం జగన్ ఆధ్వర్యంలో కాసేపట్లో ఏపీ కేబినెట్ భేటీ కానుంది. ఈ భేటీలో పలు కీలక అంశాలపై చర్చించనున్నారు. కోవిడ్ నియంత్రణపై సర్కార్ తీసుకుంటున్న చర్యలపై తొలుత మంత్రులతో సీఎం చర్చిస్తారు. ఆ తర్వాత రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలపైనా చర్చంచనున్నారు. ప్రధానంగా తెలంగాణతో ఏర్పడిన జల వివాదంపైనా మంత్రులతో జగన్ చర్చించనున్నారు. అంతేకాదు. జాబ్ క్యాలెండర్‌పై వస్తున్న విమర్శలపైనా చర్చించనున్నారు.
వచ్చే నెలలో చేపట్టనున్న మూడు లక్షల జగనన్న ఇళ్ల నిర్మాణంపైనా కేబినెట్ చర్చించనుంది. దిశా చట్టం అమలు, ప్రజల నుంచి వస్తున్న స్పందనపై చర్చించనున్నారు. ఇటీవల అఘాయిత్యాలు, భవిష్యత్తులో తీసుకోవాల్సిన చర్యలపైనా చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. నూతన ఐటీ పాలసీకి ఏపీ కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వనుంది. పేదల ఇళ్లపట్టాల క్రమబద్దీకరణకూ ఆమోదం తెలపనున్నారు. శాసన మండలి చైర్మన్, వైస్ చైర్మన్ ఎంపికపైనా చర్చించే అవకాశం ఉంది.