బ్రహ్మంగారి మఠం: మఠాధిపతి వివాదం మళ్ళీ మొదటికి.. ఒత్తిడి తెచ్చారంటూ ఆరోపణ.

-

ఆంధ్రప్రదేశ్ లో గత కొన్ని రోజులుగా బ్రహ్మంగారి మఠాధిపతి విషయంలో జరుగుతున్న వివాదం తెలియనిది కాదు. మఠాధిపతిగా వెంకటాద్రిస్వామిని నియమించాలని నిర్ణయానికి వచ్చారు. కానీ తాజాగా ఈ విషయంలో ట్విస్టు ఏర్పడింది. మఠాధిపతిగా వెంకటాద్రిస్వామి నియమకాన్ని నిలిపివేయాలని హైకోర్టులో పిటిషన్ వేసేందుకు మారుతి మహాలక్ష్మమ్మ సిద్ధమయ్యారు. మఠాధిపతి నిర్ణయంలో తనపై ఒత్తిడి తెచ్చి ఒప్పించారంటూ మహాలక్ష్మమ్మ ఆరోపించారు.

ఈ నేపథ్యంలో మహాలక్ష్మమ్మ అకస్మాత్తుగా గ్రామం నుండి వెళ్ళిపోయారు. చేతిలో ఏడు బ్యాగులతో వెళ్ళిపోయిందని గ్రామస్తులు అనుమానిస్తున్నారు. భారీగా డబ్బు, బంగారం అందులో ఉందని అనుమానం. ఈ మేరకు విచారణ జరపాలని కందిమల్లయ్యపల్లే గ్రామ ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. దీనికంతటికీ కారణం మేనేజర్ ఈశ్వరాచారి అని గ్రామ ప్రజలు ఆరోపిస్తున్నారు. ఈ విషయంలో ఎమ్మెల్యే రఘురాం రెడ్డిని కలిసి ఫిర్యాదు చేయడానికి గ్రామస్తులు సిద్ధం అవుతున్నారు. ఈ వివాదం ఇంకా ఎక్కడిదాకా వెళ్తుందో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news