ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు ముహూర్తం ఖరారైంది. ఫిబ్రవరి 2వ వారంలో అసెంబ్లీ సమావేశం కానుంది. 2023 – 24 ఆర్థిక సంవత్సరానికి అవసరమైన బడ్జెట్ ప్రతిపాదనలపై ఆమోదం తెలుపనుంది. ఈ నేపథ్యంలో ఫిబ్రవరి 8వ తేదీన ఏపీ క్యాబినెట్ సమావేశం జరగనుంది. సీఎం జగన్ అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో బడ్జెట్ కు సంబంధించిన అంశాలపై చర్చించనున్నారు.
అలాగే రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న డ్రోన్ సర్వే, ఫిబ్రవరి డు లబ్ధిదారులకు అందాల్సిన పట్టాల పంపిణీ వంటి అంశాలకు ఆమోదం తెలిపే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. వచ్చే సంవత్సరం సార్వత్రిక ఎన్నికలను ఎదుర్కొనాల్సి ఉన్నందున.. ఈ బడ్జెట్ సమావేశాలకు ప్రాధాన్యత ఏర్పడింది. విద్య, వైద్యం, వ్యవసాయ రంగాలకు ఈ బడ్జెట్ లో అధిక కేటాయింపులు ఉండొచ్చని అభిప్రాయాలు ఉన్నాయి. అలాగే అమ్మ ఒడి, నాడు నేడు, విద్యా దీవెన వంటి పథకాలను అమలు చేస్తున్నందున విద్యారంగానికి బడ్జెట్ లో భారీగా కేటాయింపులు ఉంటాయని తెలుస్తోంది.