రాహుల్ తో చంద్రబాబు భేటీ…

-

దూకుడు పెంచిన చంద్రబాబు..

‘జాతిని రక్షిద్దాం… ప్రజాస్వామ్యాన్ని కాపాడుదాం’ అనే నినాదంతో భాజపేతర పార్టీలను ఏకతాటిపైకి తెచ్చేందుకు ఏపీ సీఎం చంద్రబాబు చేస్తున్న ప్రయత్నాల్లో కీలక ముందడుగు పడిందని చెప్పుకోవాలి. ఈ రోజు హస్తినకు చేరుకున్న సీఎం.. ఎన్సీపీ అధినేత షరద్‌ పవార్‌, పాటు ఫరూక్‌ అబ్దుల్లాతో భేటీ అయ్యారు. సాధారణ ఎన్నికలు, దేశంలో జరుగుతున్న పరిణామాలు, కేంద్ర ప్రభుత్వ కక్ష సాధింపు చర్యలనుపై చర్చించారు. సీబీఐ, ఆర్బీఐ వంటి కేంద్ర వ్యవస్థల నిర్వీర్యం తదితర అంశాలపై ముగ్గురు నేతలూ కలిసి చర్చించారు. ఈ సందర్భంగా బాబు మాట్లాడుతూ.. శరద్‌ పవార్‌, ఫరూక్‌ అబ్దుల్లా ఎంతో గొప్ప నేతలని రాజకీయాల్లో వారికి చాలా అనుభవం ఉందన్నారు. ప్రస్తుత పరిణామాల దృష్ట్య భవిష్యత్తులో ఎలా ముందుకు వెళ్లాలో వారితో చర్చించినట్లు వివరించారు. భాజపేతర పార్టీలతో కలిసి ముందుకు నడుస్తామని స్పష్టం చేశారు

రాహుల్ తో భేటీ…

కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీతో సీఎం చంద్రబాబు నాయుడు కొద్ది సేపటి క్రితమే భేటీ అయ్యారు. ఈ సందర్భంగా భాజపా వ్యతిరేక పార్టీలను కలుపుకుని పోవడం గురించి ప్రధానంగా చర్చించినట్లు తెలుస్తోంది. కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే తొలి సంతకం ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదాపైనే ఉంటుందని రాహుల్‌ ప్రకటించిన నేపథ్యంలో ఇరు పార్టీల మధ్య సఖ్యతకు ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు. రాహుల్‌తో భేటీలో సీఎం వెంట ఎంపీలు గల్లా జయదేవ్‌, సీఎం రమేశ్‌,కనకమేడల రవీంద్రకుమార్‌, మాజీ ఎంపీ కంభంపాటి రామ్మోహన్‌ రావు తదితరులు ఉన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news