జనవరిలో స్విట్జర్లాండ్‌కు ఏపీ సీఎం చంద్రబాబు పయనం కానున్నారు. జనవరి 20 నుంచి 24వ తేదీ వరకు జరిగే ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సులో పాల్గొననున్నారు చంద్రబాబు. పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యంగా జనవరిలో స్విట్జర్లాండ్‌కు ఏపీ సీఎం చంద్రబాబు పయనం కానున్నారు.
ఇక అటు ఏపీ వాలంటీర్లకు బిగ్ షాక్ ఇచ్చింది చంద్రబాబు నాయుడు సర్కార్. ఏపీలో ప్రస్తుతం వాలంటీర్లు లేనట్టే అంటూ ఏపీ మంత్రి డోలా బాల వీరాంజనేయస్వామి సంచలన ప్రకటన చేశారు. వాలంటీర్ల అంశంపై కౌన్సిల్ లో చర్చ జరిగిన సందర్భంగా మంత్రి డోలా బాల వీరాంజనేయస్వామి కీలక వ్యాఖ్యలు చేశారు. 14-08-2023 తరువాత వాలంటీర్ల రెన్యువల్ జీఓ ఇవ్వలేదని తెలిపారు. వాలంటీర్ల రెన్యువల్ చేయకుండా అటు వలంటీర్లను, ఇటు ప్రజలను తప్పుదోవ పట్టించారని ఆగ్రహించారు ఏపీ మంత్రి డోలా బాల వీరాంజనేయస్వామి. ఉద్యోగంలో లేని వాలంటీర్లకు మే వరకూ జీతాలు చెల్లించామన్నారు ఏపీ మంత్రి డోలా బాల వీరాంజనేయస్వామి.