ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి కరోనా సెకండ్ వేవ్ మీద కీలక వ్యాఖ్యలు చేశారు. మొత్తం యూరప్ కోవిడ్ తో వణుకుతోందన్న ఆయన ఢిల్లీ మరో లాక్ డౌన్ కు కూడా రెడీ అయింది. ఫ్రాన్స్, లండన్ మళ్ళీ షట్ డౌన్ అవుతోందని అన్నారు. అమెరికా కూడా తీవ్రంగా ఇబ్బంది పడుతోందన్న ఆయన ప్రపంచంలోని చాలా దేశాల్లో సెకండ్ వేవ్ వస్తోందని అక్కడ మొదలు కాగానే, ఇక్కడా వస్తుందని అన్నారు. కాబట్టి జాగ్రత్తగా ఉండాలని ఆయన అధికారులను ఆదేశించారు.
స్కూళ్లు, కాలేజీలు తెరుస్తున్నారు కాబట్టి, కలెక్టర్లు శ్రద్ధ తీసుకోవాలని ఆయన ఆదేశించారు. ప్రస్తుతానికి కోవిడ్ పాజిటవ్ కేసులు తగ్గినా, సెకండ్ వేవ్ వస్తుంది కాబట్టి కలెక్టర్లు అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన అధికారులను ఆదేశించారు. అయితే జగన్ ఈ కామెంట్స్ స్థానిక ఎన్నికలకు సంబందించే చేశారా ? అనేది ఆసక్తికరంగా మారింది. ఇక ఎన్నికల సంఘానికి ప్రభుత్వానికి మధ్య ప్రత్యక్ష యుద్ధం జరుగుతున్న సంగతి తెలిసిందే.