తాజాగా జరిగిన ఓ ఘటన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ను ఎంతగానో కలచివేసింది. ఆంధ్రప్రదేశ్ లోని పలాసలో అధికారులు ఓ మృతదేహాన్ని జేసీబీతో తరలించారు. ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ సీఎం జగన్ మోహన్ రెడ్డి తన ఆవేదనని ట్వీట్టర్ ద్వారా పోస్ట్ చేశాడు. వివరాల్లోకి వెళితే.. శ్రీకాకులం జిల్లా పలాసలో ఓ వ్యక్తి (66) మరణించాడు. అంత్యక్రియ సమయానికి కోవిడ్ పాజిటివ్ అని రిపోర్ట్ రావడంతో చుట్టుపక్కల వాళ్ళు మానవత్వాన్ని విడిచి పారిపోయారు. అధికారులు కుటుంభ సభ్యుల అంగీకారం లేకుండా మృతదేహాన్ని జేసీబీ సాయంతో శ్మశానానికి తరలించారు. పలాస–కాశీబుగ్గలో జరిగిన ఘటన ముఖ్యమంత్రి కార్యాలయం దృష్టికి వచ్చింది. దినీకి రియాక్ట్ అయిన సీఎం తన ట్విట్టర్ ద్వారా ఆవేదనని వ్యక్తం చేశాడు. ఆ చర్య మానవత్వానికి విరుద్ధం అని అలా చేసిన అధికారులపై తగిన చర్యలు తీసుకోక తప్పడం లేదని ఆయన ట్వీట్ చేశాడు. సీఎంఓ ఆదేశాల మేరకు విచారణ జరిపిన శ్రీకాకుళం కలెక్టర్ నివాస్… పలాస మున్సిపల్ కమిషనర్ టి.నాగేంద్రకుమార్, శానిటరీ ఇన్‌స్పెక్టర్ ఎన్.రాజీవ్‌లను తక్షణమే సస్పెండ్ చేశారు.
శ్రీకాకుళం జిల్లా, పలాసలో కోవిడ్ మృతదేహాన్ని జేసీబీతో తరలించిన ఘటన దిగ్భ్రాంతికి గురిచేసింది. మానవత్వాన్ని చూపాల్సిన సమయంలో కొంతమంది వ్యవహరించిన తీరు బాధించింది. ఇలాంటి ఘటనలు మరెక్కడా పునరావృత్తం కాకూడదు. బాధ్యుల పై కఠిన చర్యలు తీసుకోకతప్పదు.
— YS Jagan Mohan Reddy (@ysjagan) June 26, 2020