ఇది అన్యాయం.. తెలంగాణపై కృష్ణా బోర్డుకు ఏపీ ఫిర్యాదు

-

అమరావతి : కేఆర్ఎంబీకి ఏపీ సర్కార్ మరో లేఖ రాసింది. సాగునీటి అవసరాల కోసం ఆంధ్రప్రదేశ్ ఇండెంట్ లేకుండా తెలంగాణా చేస్తున్న విద్యుత్ ఉత్పత్తిని నిలువరించాలంటూ కేఆర్ఎంబీకి లేఖ రాశారు ఈఎన్ సీ నారాయణ రెడ్డి. శ్రీశైలం , నాగార్జున సాగర్ ఉమ్మడి ప్రాజెక్టులుగా ఉన్నందున కేఆర్ఎంబీ అనుమతి తో పాటు సాగునీటి అవసరాల కోసం ఏపీ ఇండెంట్ ఉంటేనే విద్యుత్ ఉత్పత్తికి అస్కారం ఉందన్న ఏపీ.. ఈ రెండు ఉమ్మడి ప్రాజెక్టుల నుంచి తెలంగాణా ఏకపక్షంగా విద్యుత్ ఉత్పత్తి చేయలేదని స్పష్టం చేసింది.

శ్రీశైలం, నాగార్జున సాగర్, పులిచింతల ప్రాజెక్టుల నుంచి నీటిని విడుదల చేసి తెలంగాణా విద్యుత్ ఉత్పత్తి చేసుకోవడాన్ని నిలువరించాల్సిందిగా కేఆర్ఎంబీని కోరిన ఏపీ.. కృష్ణా డెల్టాలో నీటి అవసరాలపై ఏపీ ఇండెంట్ ఇస్తేనే ఉమ్మడి ప్రాజెక్టుల నుంచి నీటిని విడుదల చేయాల్సిందిగా కోరింది. రాష్ట్ర విభజన అనంతరం నాగార్జున, పులిచింతల ప్రాజెక్టుల్లో విద్యుత్ ఉత్పత్తి స్టేషన్లు భౌగోళికంగా తెలంగాణా భూభాగంలో ఉండిపోయాయని స్పష్టం చేసింది ఏపి. ఈ రెండు ప్రాజెక్టుల నుంచి కృష్ణా డెల్టా సాగునీటి అవసరాలకు నీటి విడుదల యాదృశ్చికమని పేర్కోన్న ఏపీ.. తెలంగాణా రాష్ట్రానికి ఈ రెండు ప్రాజెక్టుల దిగువన తాగు, సాగునీటి అవసరాలేమీ లేవని తెలిపింది. నాగార్జున సాగర్ దిగువన ఏపీకి సాగునీటి అవసరాలు ఉంటేనే నీటిని విడుదల చేసి ఉభయ రాష్ట్రాలూ విద్యుత్ ను వినియోగించుకోవాల్సి ఉంటుందని పేర్కొంది ఏపీ సర్కార్.

Read more RELATED
Recommended to you

Latest news