బిగ్ బ్రేకింగ్; ఏపీలో వెయ్యి దాటిన కరోనా పాజిటివ్, ఒక్క రోజే 61 కేసులు…!

-

ఆంధ్రప్రదేశ్ లో కరోనా వైరస్ కేసులు వెయ్యి దాటాయి. వరుసగా ఆరో రోజు కూడా ఏపీలో భారీగా కేసులు నమోదు అయ్యాయి. గత 24 గంటల్లో 61 కేసులు నమోదు అయ్యాయని తాజాగా విడుదల చేసిన హెల్త్ బులిటెన్ లో ఏపీ సర్కార్ ప్రకటించింది.

ఏపీలో ఇప్పటి వరకు మొత్తం 31 మంది కరోనా కారణంగా ప్రాణాలు కోల్పోయారు. 24 గంటల్లో ఇద్దరు కరోనా కారణంగా ప్రాణాలు కోల్పోగా 171 మంది కరోనా నుంచి పూర్తిగా కోలుకున్నారు. తొలిసారి శ్రీకాకుళం లో 3 కేసులు నమోదు అయ్యాయని ఏపీ ప్రభుత్వం ప్రకటించింది.

కర్నూలు జిల్లాలో అత్యధికంగా 275 కేసులు నమోదు అయ్యాయి. కృష్ణా లో ఒకరు, కర్నూలు లో ఒకరు కరోనా తో ప్రాణాలు కోల్పోయారు. కృష్ణా జిల్లాలో మొత్తం 127 కరోనా కేసులు నమోదు అయ్యాయని తెలిపింది ప్రభుత్వం. తెలంగాణా కంటే అత్యంత వేగంగా కరోనా కేసులు పెరుగుతున్నాయి.

గుంటూరు కర్నూలు జిల్లాలో కరోనా కేసులు అత్యంత వేగంగా పెరుగుతున్నాయి. నేడు కూడా ఈ రెండు జిల్లాల్లోనే భారీగా కేసులు నమోదు అయ్యాయి. గుంటూరులో 209 కేసులు నమోదు కాగా చిత్తూరు జిల్లాలో 73 కరోనా కేసులు నమోదు అయ్యాయి.

Read more RELATED
Recommended to you

Latest news