ఏపీలో కరోనా యాక్టివ్ కేసులు, మరణాల్లో తగ్గుదల బాగుందని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఏపీలో కరోనా యాక్టివ్ కేసులలో ప్రతిరోజు 13.7 శాతం తగ్గుతోందన్న ఆరోగ్య శాఖ, రోజువారీ కరోనా మరణాల్లో కూడా 4.5 శాతం తగ్గుదల ఉందని పేర్కొంది. అలానే ఏపీలో ఆగస్ట్ 13-19 తేదీల మధ్య 1,12,714 కేసులు ఉంటే, ఆగస్టు 20-26 తేదీల మధ్య 88,612 కేసులుకు తగ్గిపోయాయని పేర్కొంది.
ఆగస్టు 27- సెప్టెంబర్ 2 మధ్య 97,272 కేసులు ఉన్నాయని పేర్కొన్నారు. ఇక దేశంలోని మొత్తం కరోనా మరణాలలో, ఏపీలో 6.12 శాతంగా ఉందని, కరోనా కేసుల నమోదులో దేశంలో రెండో స్థానంలో ఉన్నా, రికవరీ రేట్ లో ఏపీ ముందంజలో ఉందని చెప్పింది. కరోనా మరణాల రేటును ఆంధ్ర ప్రదేశ్ గణనీయంగా తగ్గించిందిన పేర్కొన్నారు. అయితే ఏపీతో కలిపి ఐదు రాష్ట్రాలలో 62 శాతం కరోనా కేసులు ఉన్నాయి. మహారాష్ట్రలో 25%, ఏపీలో 12.64 శాతం, కర్ణాటకలో 11.58 శాతం, ఉత్తరప్రదేశ్ లో 7 శాతం, తమిళనాడులో ఆరు శాతం కేసులు ఉన్నాయి.