ఆంధ్రప్రదేశ్‌లో కరోనా విజృంభణ కొనసాగుతోంది. గత 24 గంటల్లో కొత్తగా 9,393 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి అని ఏపీ ప్రభుత్వం పేర్కొంది. గడిచిన 24 గంటల వ్యవధిలో ఏపీలో 55,551 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 9,393 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయిందని హెల్త్ బులిటెన్ లో ప్రభుత్వం వెల్లడించింది.
ఒక్క రోజులో రాష్ట్రంలో 95 మంది కరోనా బారిన పడి ప్రాణాలు కోల్పోయారని ప్రభుత్వం పేర్కొంది. ఇక కరోనా వలన చిత్తూరు జిల్లాలో 16 మంది, ప్రకాశం జిల్లలో 11 మంది, నెల్లూరులో 9, అనంతపురం 8, తూర్పు గోదావరి 8, పశ్చిమ గోదావరి 8, కడప 7, గుంటూరు 6, కర్నూలు 6, విశాఖపట్నం 6, శ్రీకాకుళం 5, విజయనగరం 3, కృష్ణా జిల్లాలో ఇద్దరు చప్పున మృతి చెందారు.