ఫేస్‌బుక్ వివాదం బీజేపీ, కాంగ్రెస్ పార్టీల మధ్య పెను వివాదంగా మారింది. ఈ వివాదానికి సంబంధించి ఎంపీ శశి థరూర్‌పై లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాకు బీజేపీ నేతలు ఫిర్యాదు చేశారు. ఐటీ పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ ఛైర్మెన్ శశి థరూర్ తమతో చర్చించకముందే ఫేస్‌బుక్‌కు సమన్లు జారీ చేశారని బీజేపీ ఎంపీలు స్పీకర్ దృష్టికి తీసుకువచ్చారు. కమిటీ ఛైర్మెన్ పదివి నుంచి ఆయనను తొలిగించాలని వారు స్పీకర్‌ను కోరారు.
అలాగే బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబే థరూర్‌పై సభా హక్కుల ఉల్లంఘన కింద నోటీసులు ఇచ్చారు. ఇకపోతే భారత్‌లో ఫేస్‌బుక్ బీజేపీకి వత్తాసు పలుకుతూ తమ వేదికపై కాషాయ నేతలు విద్వేష ప్రసంగం, సందేశాలు పోస్ట్ చేసేందుకు అనుమతిస్తోందన్న వాల్‌స్ట్రీట్ జర్నల్ కథనం కలకలం రేపిన సంగతి తెలిసిందే.