ఏపీలో నేడు కొత్తగా ఎన్ని కేసులో తెలుసా..!

ఆంధ్రప్రదేశ్ లో కరోనా విజృంబన అస్సలు తగ్గడం లేదు. రోజురోజుకూ రికార్డు స్థాయిలో పెరిగిపోతున్నాయి. దీని దెబ్బకి ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. లాక్ డౌన్ సడలింపుల తర్వాతే దీని ప్రభావం మరీ తీవ్రంగా మారింది. ప్రభుత్వాలు ఎన్ని చర్యలు తీసుకున్నా.. దీన్ని కట్టడి చేయలేకపోతున్నారు. కాగా, తాజాగా.. గడిచిన 24 గంటల్లో కొత్తగా 704 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

దీంతో కొత్తగా నమోదైన కేసులతో కలుపుకుని రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 14,595కు చేరింది. అలాగే నేడు కరోనా కారణంగా ఏడుగురు చనిపోయారు. దీంతో రాష్ట్రంలో కరోనా కారణంగా చనిపోయిన వారి సంఖ్య 187కు చేరింది. ఇప్పటి వరకూ కరోనా నుంచి 6,161 మంది కోలుకోని డిశ్చార్జ్ కాగా, 7,897 మంది ప్రస్తుతం ఆస్పత్రులలో చికిత్స పొందుతున్నారు.