చంద్రన్న సంక్రాంతి కానుకలు, ఏపీ ఫైబర్ గ్రిడ్ పై సీబీఐ విచారణ ముందుగా ఎవరైనా ఊహించారా.. అచ్చెన్నాయుడి అరెస్టును ముందుగా ఎవరైనా అనుకున్నారా.. జేసీ అరెస్టు గురించి ఎవరైనా తలచారా.. అంతా సడన్ సడన్ గా జరిగిపోయాయి.. జనాలతో పాటు సంబందిత వ్యక్తులు కూడా అప్పుడే సర్ ఫ్రైజో, షాకో అయ్యారు. అయితె అదే బెటర్ అంటున్నారు టీడీపీ నేతలు! దయచేసి… ముందుగా లీకులు ఇవ్వద్దంటున్నారు!
అచ్చెన్నాయుడు అప్పటివరకూ అయినా ప్రశాంతంగా గడిపాడు.. తెల్లారుజామున వచ్చి ఏసీబీ అధికారులు ఎత్తుకుపోయారు! ఇదే బెటర్ అంటున్నారు టీడీపీ నేతలు. వైకాపా నేతల నుంచో, సోషల్ మీడియా గ్రూపుల నుంచో రోజు కో లీకు వస్తుంది.. ఆ లీకుల్లో రోజుకో పేరు వస్తుంది. దీంతో నిద్రపట్టక బిక్కు బిక్కుమంటూ ఉంటున్నారంట టీడీపీ నేతలు. చింతమనేని ప్రభాకర్ తో ప్రారంభమయిన అరెస్ట్ లు ఇంకా ఆగడం లేదు. పైగా శుక్రవారం సెంటిమెంటో ఏమో కానీ.. శుక్రవారం వస్తుందంటే చాలు “అచ్చెన్న అనంతరం ఎవరనే” టెన్షన్ టీడీపీ నేతల్లో మొదలయ్యిందంట.
అచ్చెన్నాయుడుతో పాటు జేసీ ప్రభాకర్ రెడ్డి, అస్మిత్ రెడ్డిలను అరెస్ట్ చేసిన అనంతరం… కాస్త గ్యాప్ తీసుకున్న ప్రభుత్వం… అనంతరం టీడీపీ నేతలు యరపతినేని శ్రీనివాసరావు, అయ్యన్న పాత్రుడు, యనమల రామకృష్ణుడు, నిమ్మకాయల చినరాజప్ప, అఖిల ప్రియ, కేఈ కుటుంబ సభ్యులపై వరుసగా కేసులు నమోదు చేసింది! ఇదే క్రమంలో… మాజీ మంత్రులు దేవినేని ఉమ, ప్రత్తిపాటి పుల్లారావు, నారాయణ, పితాని సత్యనారాయణ వంటి వారి పేర్లు బలంగా విన్పిస్తున్నాయి. దీంతో వారి ప్రశాంతత కూడా అంతంతమాత్రంగానే ఉందంట!
దీంతో… శుక్రవారం వస్తుందంటే చాలు ఈ లీకుల వ్యవహారాలతో టీడీపీ నేతలు, గత ప్రభుత్వంలో మంత్రులుగా పనిచేసినవారూ తలలు పట్టుకున్నారని తెలుస్తోంది. దీంతో… ప్లీజ్ లీకులు మాత్రం ఇవ్వకండి. రాత్రికి రాత్రి వచ్చి పట్టుకుపోయినా పర్లేదు కానీ.. ఇలా లీకులు ఇచ్చి, బయట ఉన్న నాలుగు రోజులు కూడా ప్రశాంతంగా ఉండకుండా చేయకండి అని లబో దిబో మంటున్నారంట!! మరి ఈ విషయాన్ని లీకు వీరులు అర్ధం చేసుకుంటారా లేక.. వీరిని ఇలానే మానసిక క్షోభ కు గురిచేస్తారా అనేది వేచి చూడాలి.. మళ్లీ శుక్రవారం వరకూ!