ఏపీలో కరోనా కలకలం.. ఇవాళ ఎన్ని కేసులంటే..!

-

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. దీని దెబ్బకి ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. లాక్ డౌన్ సడలింపుల తర్వాతే దీని ప్రభావం మరీ తీవ్రంగా మారింది. ప్రభుత్వాలు ఎన్ని చర్యలు తీసుకున్నా.. దీన్ని కట్టడి చేయలేకపోతున్నారు. గత 24 గంటల్లో 28,239 శాంపిళ్లను పరీక్షించగా మరో 657 మందికి కరోనా సోకినట్లు నిర్ధారణ అయిందని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ప్రకటించింది. వారిలో 611 మంది ఏపీ వాసులు ఉన్నారని వివరించింది.

24 గంటల్లో 342 మంది కరోనా నుంచి కోలుకున్నారు. రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా కేసులు 12,813 అని పేర్కొంది. ఏపీలో చికిత్స తీసుకుంటున్న ఇతర రాష్ట్రాలు, దేశాల వారితో కలిపి మొత్తం 15,252 కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం ఆసుపత్రుల్లో కరోనాకు 7,033 మంది ఏపీ వాసులకు చికిత్స పొందుతుండగా, ఇప్పటివరకు 5,587 మంది డిశ్చార్జ్ అయ్యారు. మృతుల సంఖ్య మొత్తం 193కి చేరింది.

Read more RELATED
Recommended to you

Latest news