రాజీనామా చేసే యోచనలో ఏపీ సిఎస్ నీలం సాహ్ని…?

-

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో జరిగేది ఏంటో బయటకు వచ్చేది మాత్రం ఇప్పుడు సంచలనంగా మారుతుంది. రాష్ట్ర ప్రభుత్వ వ్యవహారశైలి కూడా కాస్త అనుమానాలకు తావిస్తుండటంతో సోషల్ మీడియా వేదికగా ఎక్కువగా ప్రచారాలు ఊపందుకున్నాయి అనేది వాస్తవం. ముఖ్యంగా హైకోర్ట్ జోక్యం నేపధ్యంలో ఇప్పుడు సోషల్ మీడియా ప్రచారం ఎక్కువగా జరుగుతూ వస్తుంది.

తాజాగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సహాని రాజీనామా చేస్తున్నారు అనే ప్రచారం ఎక్కువగా జరుగుతుంది. అయితే దాని వెనుక వాస్తవం ఏంటో తెలియదు గాని, ఆమె జారీ చేసిన జీవోలె దీనికి కారణమని అంటున్నారు. ఆరు నెలల సర్వీసు ఉన్న సమయంలో సహాని ఆ బాధ్యతలు చేపట్టారు. అయితే అక్కడి నుంచి ఆమెపై రాజకీయ ఒత్తిళ్ళు అనేవి తీవ్రంగా ఉన్నాయని అంటున్నారు.

మూడు రాజధానుల నిర్ణయం, ఇక జారి చేసిన కొన్ని జీవోలు ఆమె మెడకు చుట్టుకున్నాయి. జాస్తి కృష్ణ కిషోర్ వ్యవహారంలో నీలం సహాని జారి చేసిన నోటీసులు, జీవోలు అన్ని కూడా ఇప్పుడు ఆమెకు ఇబ్బందికరంగా మారాయి. క్యాట్ కూడా ఆమె తీరుని తప్పుబట్టింది. చివరికి ఆమె సమాధానం చెప్పుకునే పరిస్థితి ఏర్పడింది. ఈ నేపధ్యంలోనే ఆమె దీర్ఘకాలిక సెలవుపై వెళ్ళే అవకాశం ఉందని ప్రచారం జరిగింది.

ఇక ఇప్పుడు ఆమె ఆ పదవి నుంచి తప్పుకునే అవకాశ౦ ఉందని అంటున్నారు. ఆమె రాజీనామా చేసి బయటకు వెళ్ళిపోయే అవకాశం ఉందని, రాజకీయ ఒత్తిళ్ళు ఆమె తట్టుకుని నిలబడలేకపోతున్నారని అంటున్నారు. ఇప్పుడు ఆమె కోర్ట్ చుట్టూ తిరిగే అవకాశాలు కూడా కనపడుతుంది. అనేక జీవోలు,ఉత్తర్వులు ఆమె పెండింగ్ లో పెట్టినట్లు తెలుస్తుంది. రాజకీయంగా తీవ్ర ఒత్తిడి ఉన్న నేపధ్యంలో ఆ పదవి నుంచి తప్పుకుంటే ఏ గోలా ఉండదని ఆమె భావిస్తున్నారట.

Read more RELATED
Recommended to you

Latest news