ఏపీ డీజిపీ, గౌతం సవాంగ్ కీలక వ్యాఖ్యలు చేసారు. కర్ఫ్యూపై ఆయన మాట్లాడుతూ… కర్ఫ్యూ ఎలా పాటిస్తున్నారో పరిశీలించాము అని అన్నారు. ప్రజలలో సెల్ఫ్ డిసిప్లీన్ ఉంది అంటూ అభినందించారు. అందరూ నిత్యవసరాల కోసమే బయటకి రావాలి అని సూచించారు. సామాజిక దూరం, డబుల్ మాస్క్ లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అని కోరారు. కొద్దిరోజులు ఇలాంటి జాగ్రత్తలు పాటించాలి అని కోరారు.
కొద్దిరోజుల్లో మనం ఈ కోవిడ్ నుంచీ బయటపడుతాం అని ధీమా వ్యక్తం చేసారు. బయటకు వచ్చేవారి వాహనాలపై కఠిన చర్యలుంటాయి అని హెచ్చరించారు. చంద్రబాబుకు నోటీసులు జారీ చేయడం పై డీజీపీ స్పందించలేదు. రాజకీయాలకు ఇది సమయం కాదు అని అన్నారు. రాజకీయ పరమైన వదంతులు ఎవరూ తీసుకు రావద్దు అని సూచించారు. ఇప్పుడు కోవిడ్ నుంచీ బయటపడాల్సిన సమయం అని అందరూ బాధ్యతగా కోవిడ్ నుంచీ బయటపడేందుకు ఒక కుటుంబంగా పని చేయాలి అని సూచించారు.