జగన్‌ సర్కార్‌ పై ఏపీ ఉద్యోగులు సీరియస్‌..ఫేషీయల్ రికగ్నేషన్ అటెండెన్స్ తీసేయాలని !

-

జగన్‌ సర్కార్‌ పై ఏపీ ఉద్యోగులు సీరియస్‌ అయ్యారు. తాజాగా ఏపీ సీఎస్ జవహర్ రెడ్డిని కలిసింది ప్రజా ప్రతినిధుల వ్యక్తిగత సిబ్బంది అసోసియేషన్. ఫేషీయల్ రిక్నగేషన్ అటెండెన్సు నుంచి వెసులుబాటు కల్పించాలని సీఎస్ జవహర్ రెడ్డిని ఈ సందర్భంగా కోరారు ప్రజా ప్రతినిధుల ఓఎస్డీ, పీఎస్, అడిషనల్ పీఎస్, పీఏల అసోసిషన్ ప్రతినిధులు. మేం నిత్యం ప్రజల్లో ఉంటామని..మా విధులు ఆఫీసుకే పరిమితం కావన్నారు ప్రజాప్రతినిధుల వ్యక్తిగత సిబ్బంది అసోసియేషన్.

కొన్ని సందర్భాల్లో ఉదయం ఏడు గంటల నుంచి అర్థరాత్రుళ్ల వరకు పని చేయాల్సి ఉంటుందని..ఫీల్డ్ విజిట్స్ సందర్భంలో రిమోట్ ఏరియాలకు వెళ్లాల్సి ఉంటుందని తెలిపారు. నెట్ వర్క్ సరిగా లేని ప్రాంతాల్లో కూడా ప్రజా ప్రతినిధులతో పర్యటిస్తూ ఉంటాం..ఇలాంటి సందర్భాల్లో ఫేషీయల్ రికగ్నేషన్ అటెండెన్స్ వేయడం సాధ్యం కావడం లేదన్నారు ప్రజాప్రతినిధుల వ్యక్తిగత సిబ్బంది అసోసియేషన్. మా ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ఫేషీయల్ రికగ్నేషన్ అటెండెన్స్ నుంచి వెసులుబాటు కల్పించగలరని కోరారు ప్రజాప్రతినిధుల వ్యక్తిగత సిబ్బంది అసోసియేషన్.

Read more RELATED
Recommended to you

Latest news