ప్రేక్షకులతో కలిసి వీరసింహారెడ్డి సినిమా చూసిన బాలయ్య

-

సంక్రాంతి పండుగ సందడి రెండ్రోజుల ముందే షురూ అయింది. నందమూరి బాలకృష్ణ నటించిన వీరసింహారెడ్డి సినిమా ఇవాళ థియేటర్​లో సందడి చేసింది. తెలుగు రాష్ట్రాల్లోని థియేటర్ల వద్ద బాలకృష్ణ అభిమానుల సందడి మొదలైంది. వీరసింహారెడ్డి చిత్రం ప్రదర్శిస్తున్న థియేటర్ల వద్ద ఫ్యాన్స్ హంగామా చేస్తున్నారు. బాలయ్య కటౌట్లకు పాలాభిషేకం చేస్తూ కోలాహలం చేశారు.

థియేటర్ల వద్ద బాణసంచా కాలుస్తూ బాలయ్య అభిమానుల సంబురాలు చేస్తున్నారు.  కొన్నిచోట్ల ప్రదర్శన ఆలస్యమవుతోందని అభిమానుల ఆందోళన చేస్తున్నారు. మరోవైపు అభిమానులతో కలిసి నందమూరి బాలకృష్ణ వీరసింహారెడ్డి చిత్రాన్ని వీక్షించారు. హైదరాబాద్ కూకట్‌పల్లి భ్రమరాంబ థియేటర్‌లో అభిమానుల కోలాహలం మధ్య చిత్రాన్ని వీక్షించారు.

Read more RELATED
Recommended to you

Latest news