తెలుగుదేశం పార్టీ యువనేత నారా లోకేష్ పాదయాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే. యువ గళం పేరుతో నారా లోకేష్ జనవరి 27వ తేదీన తన పాదయాత్రను కుప్పం నుంచి ప్రారంభించారు. ఈ తరుణంలోనే… పాదయాత్ర మరుసటి రోజు ఆర్టీసీ డ్రైవర్… నారా లోకేష్ కు షేక్ అండ్ ఇచ్చాడు. అయితే ఆ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. దీంతో ఆ ఆర్టీసీ డ్రైవర్ ఉద్యోగం తీసేసినట్లు.. వార్తలు గుప్పుమన్నాయి.
దీంతో ప్రతిపక్షాలు జగన్ సర్కారుపై విమర్శలు దాడిని పెంచాయి. అయితే తాజాగా ఏపీ ప్రభుత్వం ఈ వివాదంపై స్పందించింది. ఆ డ్రైవర్ ఉద్యోగం తీసేయలేదంటూ, ఆధారాలతో బయటపెట్టింది. ఇలాంటి వార్తలు ప్రచారం చేసే మీడియాపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది జగన్ సర్కార్. దీంతో ఈ వివాదానికి చెక్ పడినట్లు అయింది.
This is absolutely false News. We strongly deny these claims made in media. https://t.co/iyGIpy8AQY
— APSRTC (@apsrtc) February 7, 2023