ఆ సెంటిమెంటే రాశీఖన్నా ను వెంటాడుతోందా..?

-

తెలుగు సినీ ప్రేక్షకులకు టాలీవుడ్ హీరోయిన్ రాశీఖన్నా గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. మొదట ఊహలు గుసగుసలాడే అనే సినిమా ద్వారా తెలుగు ఇండస్ట్రీకి హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ మొదటి సినిమాతోనే మంచి గుర్తింపును సొంతం చేసుకుంది.  తన అందం,  అభినయం,  నటనతో ప్రేక్షకులను తన వైపు తిప్పుకున్న ఈమె ఆ తర్వాత గోపీచంద్ హీరోగా నటించిన జిల్ సినిమాలో కూడా నటించి ప్రేక్షకులకు మరింత దగ్గరయింది. మంచి పేరు రావడంతో వరుసగా తెలుగులో అవకాశాలు అందుకుంటూ దూసుకుపోయింది.
 ప్రస్తుతం తన సినీ కెరియర్ లో ఇప్పటివరకు పదికి పైగా సినిమాలలో నటించినప్పటికీ ఆమె కెరియర్లో చెప్పుకోదగ్గ సరైన హిట్ సినిమా ఒక్కటి కూడా పడలేదు. ఇదిలా ఉండగా ఇటీవల పక్కా కమర్షియల్,  థాంక్యూ సినిమాలతో ప్రేక్షకులను పలకరించింది .కానీ ఈ రెండు సినిమాలు కూడా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలిచాయి. దీంతో ఈమెకు మళ్ళీ నిరాశ మొదలైంది. ప్రస్తుతం  ఈ ముద్దుగుమ్మ తెలుగులో ఒక సినిమాలో కూడా నటించడం లేదు పూర్తిగా అవకాశాలు కూడా తగ్గిపోయాయి. అయితే ఈమె తెలుగులో అవకాశాలు కోల్పోవడానికి కారణం ఆ సెంటిమెంట్ అన్నట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి.
రాశి కన్నా ప్రస్తుతం హిందీలో ఫర్జ్ అనే వెబ్ సిరీస్ తో పాటు యోధ అనే సినిమాలో కూడా నటిస్తోంది. ఈమె నటించిన తాజా చిత్రం థాంక్యూ. నాగచైతన్య హీరోగా విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా కూడా ఫ్లాప్ అయింది.  దీంతో రాశీఖన్నా విషయంలో ఒక సెంటిమెంట్ ప్రస్తుతం ప్రచారంలోకి వచ్చింది.  రాశిఖన్నా ఏదైనా సినిమాలో హీరోతో లిప్ లాక్ చేస్తే ఆ సినిమా ఫ్లాప్ అవుతుంది అంటూ సోషల్ మీడియాలో ఒక వార్త తెగ చెక్కర్లు కొడుతోంది. అంతేకాదు రాశీ ఖన్నా గత చిత్రాలు జిల్, జోరు,  బెంగాల్ టైగర్ , టచ్ చేసి చూడు,  వరల్డ్ ఫేమస్ లవర్ ఇలా అన్ని చిత్రాలలో కూడా లిప్ లాక్స్ ఉన్నాయి.  అందుకే అవి ఫ్లాప్ అయ్యాయి అంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news