ఏపీలో చివరి విడత పంచాయతీ ఎన్నికలు.. కొన్ని చోట్ల ఉద్రిక్త పరిస్థితులు !

-

ఆంధ్రప్రదేశ్ లో చివరి విడత పంచాయతీ ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ నాలుగో దశలో మొత్తం పదమూడు జిల్లాలలో ఉన్న 161 మండలాల్లో పోలింగ్ జరుగుతోంది. 3299 పంచాయతీలు, 33435 వార్డులకు ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేయగా మొత్తం 553 పంచాయతీలు 10921 వార్డులు ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన 2744 పంచాయతీలకు 22422 వార్డులకు ఈరోజు పోలింగ్ జరుగుతోంది.. ఈరోజు ఉదయం నుంచే ఓటింగ్ కోసం ఓటర్లు బారులు తీరారు. కృష్ణాజిల్లా గన్నవరంలో సమస్యాత్మక కేంద్రాల వద్ద భద్రత భారీగా పెంచారు.

elections
elections

ఫోటో సరిగ్గా లేకపోయినా ఓటర్లను సిబ్బంది వెనక్కు పంపించేస్తున్నారు. గుంటూరు జిల్లా కంటెపూడిలో చీఫ్ ఏజెంట్ కృష్ణారెడ్డి మీద పోలీసులు ఒత్తిడి తెచ్చినట్లు తెలుస్తోంది. అలాగే రెబల్ అభ్యర్థుల అనుచరులను కూడా పోలీస్ స్టేషన్ కు రమ్మని బెదిరింపులకు దిగినట్లు చెబుతున్నారు. గుంటూరు జిల్లా నందిగామ లో వైసీపీ నేతలు వినూత్న ప్రచారం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఏకంగా రేషన్ డెలివరీ వాహనం తీసుకువెళ్లి పోలింగ్ కేంద్రం పోలింగ్ కేంద్రం వద్ద కూర్చుని ప్రచారం చేస్తున్నట్లు చెబుతున్నారు. ఇక నెల్లూరు జిల్లా కోవూరులో భారీ వర్షంలోనూ పోలింగ్ కొనసాగుతోంది. వర్షంలో తడుస్తూ పసిబిడ్డ లో సైతం ఒక మహిళ ఓటు వేసేందుకు వచ్చినట్లు చెబుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news