ఏపీఎస్ ఆర్టీసీ ప్రయాణికులకు గుడ్ న్యూస్..

Join Our Community
follow manalokam on social media

ఏపీఎస్ ఆర్టీసీ తమ వినియోగదారులకు ఒక ఆఫర్ ప్రకటించింది. ‘ఎర్లీ బర్డ్’ పేరిట అందుబాటులో ఉండనున్న ఈ ఆఫర్ లో భాగంగా ఏసీ బస్సుల్లోని అన్ని సీట్లలో, సూపర్ డీలక్స్, అల్ట్రా డీలక్స్, ఎక్స్ ప్రెస్ బస్సులో 10 శాతం సీట్లపై ఆఫర్లు ప్రకటించనున్నారు. ఆయా సర్వీసుల్లో కనీసం 48 గంటల ముందుగా టికెట్లను రిజర్వ్ చేయించుకుంటే, టికెట్ ధరపై 10 శాతం రాయితీ లభించనుంది.

ఇక ఈ ఎర్లీ బర్డ్ ఆఫర్ వలన సూపర్ లగ్జరీ, అల్ట్రా డీలక్స్ బస్సుల్లో నలుగురు, ఎక్స్ ప్రెస్ బస్సుల్లో ఐదుగురు రాయితీపై టికెట్ ను కొనుగోలు చేయవచ్చు. ఇక ఏపీఎస్ ఆర్టీసీ వద్ద 348 ఏసీ బస్సులుండగా కరోనా కారణంగా వాటిలో 270 బస్సులు మాత్రమే రోడ్ల మీద తిరుగుతున్నాయి. అయితే కరోనా పరిస్థితులు కాస్త కుదుట పడుతున్న కారణంగా అన్ని బస్సు సర్వీసులను పునరుద్ధరించనున్నారు. అందుకే ప్రయాణికులను ఆకర్షించేందుకు అన్ని టికెట్ల మీదా రాయితీ అందించాలని అధికారులు నిర్ణయించారు. 

TOP STORIES

నీ లోపలి బాధలే కాదు, నీ బయట ఏం జరుగుతుందో తెలుసుకోకుంటే అలాగే మిగిలిపోతావని తెలిపే కథ..

ఒక కొండమీద నివాసముండే అమ్మాయి నీళ్ళకోసం కొండదిగి నది వద్దకు వస్తూంటుంది. భుజం మీద కావిడి పట్టుకుని రెండు కుండల్లో నీళ్ళు పట్టుకుని కొండమీదకి వెళ్తుండేది....