నిరుద్యోగులకు ఏపీ శుభ వార్త… త్వరలోనే పోలీస్ శాఖలో 14 వేల ఉద్యోగాలు

-

నిరుద్యోగులకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా పోలీస్ శాఖ లో ఏకంగా 14 వేల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని… త్వరలోనే వాటిని భర్తీ చేస్తామని ఏపీ హోం శాఖ మంత్రి మేకతోటి సుచరిత ప్రకటన చేశారు. పోలీసు శాఖలో సిబ్బంది కొరత ను త్వరలోనే పరిష్కరిస్తామని ఆమె పేర్కొన్నారు. గుంటూరు జిల్లా వినుకొండ లో అంబేద్కర్ విగ్రహాన్ని హోంమంత్రి మేకతోటి సుచరిత ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పోలీసు శాఖలో సిబ్బంది కొరత కారణంగా పడుతున్న ఇబ్బందులు వాస్తవమేనని… ఆ ఇబ్బందులను త్వరలోనే పరిష్కరిస్తామని ప్రకటన చేశారు సూచరిత. వినుకొండలో అభివృద్ధి చేసేందుకు ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు చేస్తున్న కృషి అభినందనీయమని కొనియాడారు. పేద ప్రజల సంక్షేమానికి సీఎం జగన్మోహన్ రెడ్డి అనేక సంక్షేమ పథకాలు చేపడుతున్నారని గుర్తుచేశారు హోంమంత్రి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న పథకాలు ఎక్కడ కూడా అమలు కావడం లేదని హోంమంత్రి సుచరిత వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Latest news