ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన్ ఆరోగయ యోజన (ఏబీ పీఎం-జేఏవై) నాలుగో, ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ (ఏబీడీఎం) ఒకటో వార్షికోత్సవం సందర్భంగా ఢిల్లీలో కేంద్ర వైద్యశాఖ నిర్వహిస్తోన్న ఆరోగ్య మంథన్-2022 కార్యక్రమంలో సెప్టెంబర్ 26న కేంద్ర వైద్యశాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ చేతుల మీదుగా రాష్ర వైద్య, ఆరోగ్యశాఖ ప్రత్యేక కార్యదర్శి నవీన్ కుమార్ ఈ అవార్డులను అందుకున్నారు. ఆయుష్మాన్ భారత్ హెల్ అకౌంట్స్ (అభా)కు అత్యధికంగా ఆరోగ్య రికార్డులను అనుసంధానం చేసిన రాష్రం, జిల్లాలు, 100 శాతం ఆస్పత్రులు ఈహెచ్ఎర్లో ఎన్రోల్మెంట్, ఉతమ ప్రభుత్వ ఆరోగ్య రికార్డు ఇంటిగ్రేటర్ విభాగాల్లో ఏపీ ఆరు అవార్డులు సాధించింది.
కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ (ఏబీడీఎం)లో ఆంధ్ర ప్రదేశ్ సత్తా చాటింది. పథకం అమలులో అత్యుత్తమంగా రాణించిన ఏపీ ప్రభుత్వం ఏకంగా 6 అవార్డులను కైవసం చేసుకుంది. ఈ మేరకు శుక్రవారం వైద్య,ఆరోగ్య శాఖపై జరిగిన సమీక్షలో భాగంగా కేంద్రం అందించిన అవార్డుల గురించి ఆ శాఖ మంత్రి విడదల రజని సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి తెలిపారు. ఏపీలో ఆయుష్మాన్ భారత్ పథకాన్ని మెరుగైన రీతిలో అమలు చేసిన తీరుకు గానూ ఈ అవార్డులు వచ్చినట్లు ఆమె తెలిపారు. రాష్ట్రానికి ఏకంగా 6 అవార్డులు వచ్చేలా పనిచేసిన వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు, క్షేత్ర స్థాయి సిబ్బందికి ఆమె కృతజ్ఞతలు తెలిపారు.