అధికారంలోకి వచ్చిన నాటి నుండి అనేక సంచలన నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళుతున్న జగన్ మరో సంచలన నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఐదుగురు డిప్యూటీ సీఎంలను క్యాబినెట్ లో నియమించి సంచలనం సృష్టించిన ఆయన ఇప్పుడు పురపాలక సంఘాలకు సంబంధించిన అంశంలో కూడా ఇద్దరు డిప్యూటీలు ఉండేలా ఒక ఆర్డినెన్స్ తీసుకు వచ్చారు.. ఆంధ్రప్రదేశ్ పురపాలక చట్టానికి సవరణలు చేశారు. ఏపీ మున్సిపల్ కార్పొరేషన్ లు, మున్సిపాలిటీల్లో అదనంగా డిప్యూటీ మేయర్ లు, డిప్యూటీ వైస్ చైర్మన్ లు ఉండేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
ఈ కొత్త ఆర్డినెన్స్ తో కార్పొరేషన్ లలో ఇద్దరు డిప్యూటీ మేయర్ లు, మున్సిపాల్టీలు నగర పంచాయతీలో ఇద్దరు వైస్ చైర్మన్ లను ఎన్నుకునే అవకాశం ఉంటుంది. ఈ మున్సిపల్ చట్టానికి సవరణలు చేసి గవర్నర్ కు పంపగా సదరు ఆర్డినెన్స్ ని గవర్నర్ ఆమోదించారు. త్వరలోనే ఎస్ఈసీకి ఈ ఆర్డినెన్స్ పంపనుంది. ఎస్ఈసీ నుంచి నోటిఫికేషన్ వచ్చిన అనంతరం…కార్పొరేషన్ లలో ఇద్దరు డిప్యూటీ మేయర్ లు, మున్సిపాల్టీలు నగర పంచాయతీలో ఇద్దరు వైస్ చైర్మన్ లు ఉండేందుకు వీలు కలుగుతుంది.