కోవాగ్జిన్-కోవిషీల్డ్ వ్యాక్సిన్‌ల్లో ఏది బెస్ట్.. వాటి సైడ్ ఎఫెక్ట్స్..!

-

కరోనా మహమ్మారిని అడ్డుకునేందుకు ప్రపంచవ్యాప్తంగా టీకాలు అందుబాటులోకి వచ్చాయి. భారత్‌లో మాత్రం ప్రముఖంగా రెండు రకాల టీకాలు వినియోగంలో వచ్చాయి. ఇప్పటికే దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతోంది. దశలవారీగా కరోనా బాధితులకు కరోనా టీకా ఇస్తున్నారు. మొదటి దశలో కరోనా వారియర్స్, వైద్య సిబ్బంది, 60 ఏళ్లు పైబడిన వయోవృద్ధులు, 45 ఏళ్ల వయసు ఉన్న వారికి వ్యాక్సిన్ వేస్తున్నారు. మిగిలిన వారు నిర్భయంగా టీకా వేయించుకోవాలని ప్రోత్సహిస్తున్నారు. ప్రస్తుతం దేశంలో రెండు టీకాలు అందుబాటులో ఉన్నాయి. అందులో ఒకటి ఆక్స్‌ఫర్డ్-ఆస్ట్రాజెనికా సంయుక్తంగా తయారు చేసిన కోవిషీల్డ్, మరొకటి దేశీయ ఫార్మా దిగ్గజ కంపెనీ భారత్ బయోటెక్ తయారు చేసిన కోవాగ్జిన్ అందుబాటులో ఉన్నాయి. అయితే ఈ రెండు టీకాల్లో ఏది మంచిదనే విషయంపై ప్రజల్లో అనేక సందేహాలు ఉన్నాయి. కోవాగ్జిన్, కోవిషీల్డ్ వ్యాక్సిన్ల పనితీరు, ప్రభావం, వైఫల్యాల గురించి కేంద్ర వైద్యారోగ్య శాఖ వివరాలను వెల్లడించింది.

కోవాగ్జిన్-కోవిషీల్డ్
కోవాగ్జిన్-కోవిషీల్డ్

కోవిషీల్డ్..
కోవిషీల్డ్ అనేది ఒక ఇంట్రామస్కులర్ టీకా. వైరల్ వెక్టర్ ప్లాట్‌ఫామ్‌ను ఉపయోగించి టీకాను తయారు చేశారు. దీనిని ఆక్స్‌ఫర్డ్-ఆస్ట్రాజెనికా సంయుక్తంగా అభివృద్ధి చేయగా.. భారతదేశంలోని సీరమ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా ఉత్పత్తి చేస్తోంది. రెండు డోసుల టీకాను వేసుకుంటే శరీరంలో వైరస్‌ను నియంత్రించేందుకు.. రోగనిరోధక వ్యవస్థను మరింత పెంచేందుకు దోహదపడుతుంది. ఇప్పటివరకు ఈ వ్యాక్సిన్ 81.3 శాతం సమర్థవంతంగా పనిచేసినట్లు మెడికల్ రిపోర్టులు చెబుతున్నాయి. దీని ధర ప్రైవేట్ ఆస్పత్రుల్లో డోసుకు రూ.250 ఉండగా.. ప్రభుత్వ ఆస్పత్రిలో ఉచితంగా అందజేస్తున్నారు.
దుష్ప్రభావాలు..
కోవిషీల్డ్ వ్యాక్సిన్ వేసుకున్న చోట తీవ్ర నొప్పి ఉంటుందని వైద్యులు తెలుపుతున్నారు. తలనొప్పి, అలసట, కండరాలు, కీళ్ల నొప్పులు, జ్వరం, చలి, వికారం వంటి దుష్ప్రభావాలు చూపుతాయి.

కోవాగ్జిన్..
కోవాగ్జిన్ కూడా ఇంట్రామస్కులర్ టీకా. దీనిని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్), నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ (ఎన్‌ఐవీ) సహకారంతో హైదరాబాద్‌కు చెందిన భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ అభివృద్ధి చేసింది. హోల్-విరియన్ ఇనాక్టివేటెడ్ వెరో సెల్-డ్రైవ్‌డ్ సాంకేతికతతో అభివృద్ధి చేయబడింది. వైరస్‌కు వ్యతిరేకంగా ఉంటూ రోగనిరోధకశక్తిని పెంచుతుంది. కోవాగ్జిన్‌ను కూడా రెండు డోసులు తీసుకోవాలి. ఈ వ్యాక్సిన్ 80.6 శాతం సమర్థతను కలిగి ఉంది. దీని ధర ప్రైవేట్ ఆస్పత్రిలో రూ.250, ప్రభుత్వ ఆస్పత్రిలో ఉచితంగా ఇస్తున్నారు.
దుష్ప్రభావాలు..
కోవాగ్జిన్ ఇంజెక్షన్ వేసిన చోట నొప్పి, వాపు, ఎర్రగా మారడం, దురదగా అనిపిస్తుంది. శరీరం బలహీనంగా అనిపించడం, ఒళ్ల నొప్పులు, తలనొప్పి, జ్వరం, దద్దుర్లు, వికారం, వాంతులు వంటి సమస్యలు తలెత్తుతాయి.

Read more RELATED
Recommended to you

Latest news