30ఏళ్ళు దాటినా పెళ్ళవడం లేదని బాధపడుతున్నారా? డోన్ట్ వర్రీ.. ఇది తెలుసుకోండి.

-

ముఫ్పై ఏళ్ళు దాటుతున్నా పెళ్ళి చేసుకోకుండా సింగిల్ గా ఉన్నవారు చాలా అదృష్టవంతులనే చెప్పాలి. ప్రస్తుతం ఎవరూ అంత తొందరగా పెళ్ళిళ్ళు చేసుకోవట్లేదు. 20ల్లో కెరీర్ సెట్ చేసుకోవడంలో మునిగిపోతున్నారు. అంతేకాదు పర్యాటకానికి బాగా ప్రాముఖ్యత ఇస్తున్నారు. అంతా అయ్యాకే తీరిగ్గా పెళ్ళి ముచ్చటకి వస్తున్నారు. ఐతే మీకిది తెలుసా? 30తర్వాత పెళ్ళి చేసుకుంటే ఎలా ఉంటుందో? ఎందుకు 30 తర్వాత చేసుకోవాలో తెలుసుకుందాం.

కావాల్సినంత సమయం దొరుకుతుంది.

హనీమూన్ అయిపోయాక మీ ఇద్దరు మాట్లాడుకోవాలంటే లైఫ్ లో జరిగిన చాలా విషయాలు చెప్పాల్సి ఉంటుంది. అప్పుడు మాటలు తడుముకోకుండా ఉండడానికి కావాల్సినంత సమయం తీసుకోండి. క్రేజీ క్రేజీ అనుభవాలు పొందండి.

కుటుంబంతో గడపండి

కుటుంబానికి, స్నేహితులకు సమయం ఇవ్వలేకపోతున్నానని పెళ్ళయిన వాళ్ళు కంప్లైంట్ చేస్తుంటారు. అదే పెళ్ళి ఆలస్యం అవుతుంటే అలాంటి ఇబ్బంది ఉండదు. కావాల్సినంత సమయం ఫ్యామిలీకి, ఫ్రెండ్స్ కి ఇవ్వవచ్చు.

సంజాయిషీ ఇవ్వాల్సిన పనిలేదు

బంధం అంటేనే పంచుకోవడం. అది ఏదైనా సరే. ఒక్కోసారి అలా పంచుకోవడాలు ఇబ్బంది పెడుతుంటాయి. బ్రహ్మచారిగా ఉన్నన్ని రోజులు ఇలాంటి సమస్యలు ఉండవు. సో.. ఎంజాయ్ చేయండి.

చిలిపిదనాన్ని బయటకు తీయండి

కెరీర్ మార్పులు, సడెన్ టిప్పులు పెళ్ళయ్యాక కుదరవు. లైఫ్ లో చిలిపిగా ఏదైనా చేయాలనుకుంటే వెంటనే చేసేయండి. పెళ్ళైతే మళ్ళీ కుదరకపోవచ్చు. పెళ్ళి ఆలస్యం అవుతుంటే ఇలాంటి అనుభూతులు చాలా ఎక్కువ చవిచూస్తారు.

సరైన వాళ్ళు దొరికే అవకాశం ఎక్కువ

తొందరగా పెళ్ళి చేసుకుంటే ఆప్షన్స్ తగ్గిపోతాయి. అదే ఆలస్యం అవుతుంటే సరైన వాళ్ళు దొరికే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. మీకు కావాల్సిన వాళ్ళు మీరనుకున్న లక్షణాలతో దొరకాలంటే జీవితంలో ఎంతో కొంత అనుభవించాలి. అప్పుడే మీకు మెచ్యూరిటీ పెరుగుతుంది. ఏది కావాలో ఏది వద్దో తెలుస్తుంది.

Read more RELATED
Recommended to you

Latest news