నకిలీ మందుల మీద ఏపీ సర్కార్ ఫోకస్.. టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు !

ఆంధ్రప్రదేశ్ లో నకిలీ మందుల విక్రయాలు మీద ఏపీ ప్రభుత్వం నిఘా పెట్టింది. ఇప్పటికే డ్రగ్ ఇన్స్పెక్టర్లు, పోలీసులతో కొన్ని ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. చండీగఢ్, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల కేంద్రంగా ఈ నకిలీ మందులు సప్లై అవుతున్నట్టు గుర్తించారు. ఇక ఆంధ్ర ప్రదేశ్ విషయానికి వస్తే విజయవాడ కేంద్రంగా నకిలీ మందుల విక్రయాలు జరిగాయి అని అంటున్నారు.

ఈ క్రమంలో విజయవాడ హరిప్రియ ఫార్మా ఏజెన్సీ సీజ్ చేశారు. ఇక ఈ నకిలీ మందుల వ్యవహారం ఈ మధ్యనే భీమవరంలో వెలుగు చూసింది. ఈ వ్యవహారాన్ని సీరియస్ గా తీసుకుని ఏపీ సర్కార్ ఈ స్పెషల్ టీమ్స్ ను ఏర్పాటు చేసింది అని అంటున్నారు. నకిలీ మందుల పై ఫిర్యాదు చేసేందుకు టోల్ ఫ్రీ నెంబర్ కూడా రెడీ చేశారు. ఏమైనా మందులు అనుమానాస్పదం గా ఉంటే 0863 2330909, 2339246 లకు కాల్ చేసి ఫిర్యాదు చేయవచ్చని చెబుతున్నారు.