ఆంధ్రప్రదేశ్ లో కరోనా వైరస్ అత్యంత వేగంగా పెరుగుతున్న సంగతి తెలిసిందే. రోజు రోజుకి కరోనా కేసులు పెరుగుతున్న నేపధ్యంలో ప్రభుత్వం దీన్ని ఎదుర్కోవడానికి అన్ని విధాలుగా సమాయత్తం అవుతుంది. దీన్ని గ్రామ స్థాయిలోకి వెళ్ళకుండా అడ్డుకోవడానికి గానూ చాలా జాగ్రత్తగా చర్యలు చేపడుతుంది. ఈ నేపధ్యంలోనే కోవిడ్ 19 ర్యాపిడ్ టెస్ట్ కిట్ లను ఏపీ ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొచ్చింది.
దీని ద్వారా కేవలం గంట లోపే కరోనా పరీక్షను పూర్తి చేసే అవకాశం ఉంటుంది. తాజాగా సిఎం వైఎస్ జగన్ నిర్వహించిన సమీక్షా సమావేశంలో దీన్ని పరిశీలించారు. విశాఖ మెడ్ టెక్ జోన్ లో తయారైన ఈ కిట్స్ ఇప్పుడు ఏపీలో కీలకం కానున్నాయి. కరోనా పరీక్షను అత్యంత వేగంగా చేయడానికి వి ఉపయోగపడతాయని ప్రస్తుతం వెయ్యి కిట్లను అందుబాటులోకి తీసుకొచ్చామని ఏపీ సర్కార్ పేర్కొంది.
రాబోయే వారం రోజుల్లో ఇవి పది వేల వరకు అందుబాటులోకి తీసుకొస్తామని సర్కార్ వివరించింది. మంత్రులు ఆళ్ళ నానీ, గౌతం రెడ్డి, డీజీపీ సవాంగ్, సియేస్ నీలం సహాని ఈ సమావేశంలో పాల్గొన్నారు.కరోనా తీవ్రత ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో వేటిని ఎక్కువగా వాడుకుంటారు. ఒక్కో కిట్ ద్వారా రోజుకి 20 మందిని పరీక్షించే అవకాశం ఉంటుంది. అవసరమైతే దేశానికి కూడా వీటిని సరఫరా చేయనుంది ఏపీ ప్రభుత్వం.