ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం..ఇకపై వెబ్సైట్ లో జీవోలు కనిపించవు.. !

ఏపీ సర్కార్ ప్రభుత్వ జీవోల పై కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటి నుండి ప్రభుత్వ వెబ్సైట్ లో జీవోలను ఇవ్వడం నిలిపేయాలని ఆదేశాలు జారీ చేసింది. కొద్దిసేపటి క్రితం ఈ మేరకు ఆంధ్ర ప్రదేశ్ పరిపాలన శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ త్యాగరాజు నోట్ విడుదల చేశారు. ప్రభుత్వ జీవోలను ఇకపై ఆన్లైన్ లో పెట్టేలా అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు.

ఏపీ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో ఇక పబ్లిక్ డొమైన్ లో ప్రభుత్వ ఉత్తర్వులు కనిపించవు. ఇతర రాష్ట్రాలలో మరియు కేంద్ర ప్రభుత్వం లో ఉన్న పద్ధతిని అనుసరిస్తున్నామని ఏపీ ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. 2008 నుండి ప్రభుత్వ జీవోలను ఏపీ ప్రభుత్వం పబ్లిక్ డొమైన్ లో అందుబాటులో ఉంచుతోంది. ఇక తాజాగా తీసుకున్న నిర్ణయంతో ఆఫ్ లైన్ లోనే ప్రభుత్వ జీవో లు అందుబాటులో ఉంటాయి.