నీటి ప్రాజెక్ట్ లపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం…!

-

రాష్ట్ర వ్యాప్తంగా వివిధ రిజర్వాయర్లలో పూడిక నిల్వ, నీటి సామర్థ్యం అంచనా సర్వేల కోసం బిడ్లు ఆహ్వానించాలని ప్రభుత్వ నిర్ణయం తీసుకుంది. ఏలేశ్వరం, వెలిగోడు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లో పూడిక, నిల్వ సామర్ధ్యాల సర్వే చేయనున్నారు. శ్రీశైలం రిజర్వాయర్ , రాళ్లపాడు రిజర్వాయర్, , మైలవరం రిజర్వాయర్లలో బాతో మెట్రిక్ సర్వే కోసం జాతీయ హైడ్రాలజీ ప్రాజెక్టు కింద పోటీ బిడ్లను ఆహ్వానించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

srisailam-dam
srisailam-dam

పనుల అంచనాల రూపకల్పన కోసం జలవనరుల శాఖ నేతృత్వంలో సాంకేతిక కమిటీని నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. సభ్యులుగా హైడ్రాలజీ విభాగం సూపరిండెంట్ ఇంజనీర్, కేంద్ర జలసంఘం నుంచి సాంకేతిక విభాగం నుంచి , కాకినాడలోని జాతీయ హైడ్రాలజీ సంస్థ డైరెక్టర్ ను నియమిస్తూ ఆదేశాలు జారీ చేసింది.

Read more RELATED
Recommended to you

Latest news