మహారాష్ట్ర సీఎం, గవర్నర్ మధ్య వివాదం..గవర్నర్ లేఖపై ఉద్ధవ్‌ కౌంటర్‌

-

గత కొంత కాలంగా మహారాష్ట్ర రాజకీయంలో రసవత్తంగా మారుతుంది..సుశాంత్ ఆత్మహత్య కేసుతో మొదలైన మహారాష్ట్ర రాజకీయం..డ్రగ్స్‌ కేసు, కంగనా రనౌత్‌ వ్యాఖ్యలతో నిత్యం రాజకీయ రగఢ కొనసాగుతూనే ఉంది..తాజాగా మహారాష్ట్ర గవర్నర్‌, సీఎం ఉద్ధవ్ థాక్రే మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది.. మహారాష్ట్రలో ఆలయాలు తెరవాలని కోరుతూ గవర్నర్ భగత్ సింగ్‌ కొష్యారీ లేఖ రాయడం..దానికి ఉద్ధవ్ థాక్రే కౌంటర్ ఇవ్వడంతో ఒక్కసారిగా హీటెక్కింది. ఇటు బీజేపీ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు నిర్వహించడంతో పొలిటికల్‌ వార్‌గా మారింది.

సోమవారం గవర్నర్‌ భగత్‌సింగ్ కొష్యారీ ఉద్ధవ్‌ ధాక్రేకు లేఖ రాశారు. కోవిడ్‌ జాగ్రత్తలు పాటిస్తూ రాష్ట్రంలో ఆలయాలు తెరిచేలా చూడాలని కోరారు. సీఎంగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత మీరు అయోధ్యను సందర్శించి రాముడిమీద మీ భక్తిని చాటుకున్నారు. ఆషాఢ ఏకాదశిన విఠల్ రుక్మిణి మందిరాన్ని దర్శించి పూజలు చేశారు. కానీ ఇప్పుడు ఆలయాలు, ప్రార్థనా మందిరాలను రీఓపెన్ చేయట్లేదని, సెక్యులర్‌గా మారిపోయారా అంటూ ప్రశ్నించారు. అంతేకాదు కరోనా తీవ్రత ఎక్కువగా ఉన్నా పార్కులు, బీచ్‌లు, మాల్స్ ఓపెన్ చేశారని, వాటికి లేని నిబంధనలు ఆలయాలకే అడ్డువచ్చాయా అని లేఖలో ప్రశ్నించారు గవర్నర్‌.

గవర్నర్ లేఖపై స్పందించిన ఉద్ధవ్ థాక్రే ఘాటుగా రిప్లై ఇచ్చారు..తన హిందుత్వపై ఎవరి నుంచీ సర్టిఫికెట్ అవసరం లేదని కౌంటర్‌ ఇచ్చారు..నేను హిందుత్వను అనుసరిస్తాను, నా హిందుత్వాన్ని మీరు తనిఖీ చేయనక్కర్లేదు అంటూ గవర్నర్‌కు రిప్లై ఇచ్చారు ఉద్ధవ్‌..మరో వైపు మహారాష్ట్ర గవర్నర్‌ సెక్యులర్‌ అనే పదాన్ని తప్పుగా భావించడంపై
శివసేన మిత్రుడు శరద్ పవార్ ప్రధాని నరేంద్ర మోడీకి ఒక లేఖ రాశారు మరియు గవర్నర్ ఉపయోగించిన భాషపై తాను షాక్ అయ్యానని, ఆశ్చర్యపోయానని అన్నారు..
“మీరు కూడా ‘లౌకిక’ అనే పదాన్ని కలిగి ఉన్న రాజ్యాంగం ద్వారా ప్రమాణం చేశారని మీరు మర్చిపోయారా? మీరు దానిని తిరస్కరిస్తున్నారా?అని శరద్ పవార్ గవర్నర్‌ను ప్రశ్నించారు.

Read more RELATED
Recommended to you

Latest news