బ్రేకింగ్‌ : జలవివాదంపై సుప్రీం కోర్టు మెట్లెక్కిన ఏపీ

-

ఢిల్లీ: తెలుగు రాష్ట్రాల మధ్య జల వివాదం కొనసాగుతూనే ఉంది. ఈ నేపథ్యంలో తాజాగా జల వివాదంపై సుప్రీం కోర్టు మెట్లెక్కింది ఆంధ్ర ప్రదేశ్‌ సర్కార్‌. కృష్ణా జలాల వినియోగంలో తెలంగాణ సృష్టిస్తున్న అడ్డంకులు, అవరోధాలు, అక్రమాలపై సుప్రీంకోర్టులో ఏపీ ప్రభుత్వం పిటిషన్ దాఖలు చేసింది.
“కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు” పరిధిని వెంటనే నోటిఫై చేయాలని పిటిషన్ వేసింది ఏపీ సర్కార్‌.

తెలంగాణ ప్రభుత్వం జూన్ 28న జారీ చేసిన జీవోను రద్దు చేయాలని… ఏపీ న్యాయమైన వాటాకు తెలంగాణ ప్రభుత్వం గండి కొడుతోందని పిటీషన్‌ లో పేర్కొంది. తెలంగాణ ప్రభుత్వం రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరిస్తోందని తెలిపింది. తాగు, సాగునీటి జలాలు దక్కకుండా ప్రజల జీవించే హక్కును తెలంగాణ ప్రభుత్వం హరిస్తోందని….కృష్ణా జలాల పంపిణీ అవార్డును ఉల్లంఘిస్తోందని పిటిషన్ లో పేర్కొంది ఏపీ ప్రభుత్వం. కాగా.. అటు తెలంగాణ ప్రభుత్వం కూడా ఈ వివాదంపై సుప్రీం కోర్టు వెళ్లే ఆలోచన ఉన్నట్లు సమాచారం.

Read more RELATED
Recommended to you

Latest news