ఏపీలో ప్రభుత్వం vs కోర్టులు అనే గొడవ ఇంకా కొనసాగుతూనే ఉంది. తాజాగా ఏపీ హైకోర్టులో జగన్ ప్రభుత్వం ఒక సంచలన పిటిషన్ దాఖలు చేసింది. హైకోర్టు జడ్జ్ జస్టిస్ రాకేష్ కుమార్‌కు వ్యతిరేకంగా అఫిడవిట్ దాఖలు చేసింది. నవ రత్నాల అమలు కోసం ప్రభుత్వ ఆస్తులు విక్రయించాలన్న పిటిషన్లపై విచారణ జరుపుతున్న ధర్మాసనంలో ఆయన ఉంటే తమకు న్యాయం జరగదని పిటిషన్ దాఖలు చేసింది.
ఈ పిటిషన్ల విచారణ నుంచి జస్టిస్ రాకేష్ కుమార్ తప్పుకోవాలంటూ మంగళవారం మిషన్ బిల్డ్ ఏపీ స్పెష ల్ ఆఫీసర్ ప్రవీణ్ కుమార్ అఫిడవిట్ దాఖలు చేశారు. ఆయన ఈ కేసుల్లో ఉంటే కనుక పక్షపాతంతో వ్యవహరించే అవకాశముందని ఆరోపించారు. పక్షపాతంతో వ్యవ హరించేందుకు ఆస్కారం ఉందని సహేతుక ఆందోళన ఉన్నప్పుడు.. కేసు విచారణ నుంచి తప్పుకోండని కోరవచ్చంటూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును ప్రభుత్వం తన అఫిడవిట్ లో ప్రభుత్వం ప్రస్తావించింది. ఈ పిటిషన్లపై రేపు విచారణ జరగనుంది.