ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్ : డిసెంబర్ 25 నుండి వ్యాక్సిన్ !

-

ఇప్పటికే దేశ వ్యాప్తంగా కరోనా వ్యాక్సిన్ పంపిణీకి కేంద్ర ప్రభుత్వం సిద్దం అవుతోన్న సంగతి తెలిసిందే. అయితే ఎప్పుడు మొదలవుతుంది అనే దాని మీద సరయిన క్లారిటీ లేదు. ఇప్పటికే అన్ని రాష్ట్రాలతో కేంద్రం ఈ పంపిణీ విషయం మీద అనేక చర్చలు జరుగుతున్నాయి. అయితే ఈ క్రమంలో ఈ నెల 25 నుండి వ్యాక్సిన్ పంపిణీ మొదలు పెడ్తున్నామని వైసీపీ నేత విజయసాయి రెడ్డి ప్రకటించారు.

డిసెంబరు 25 నుంచి రాష్ట్రవ్యాప్తంగా కోటి మందికి కరోనా వ్యాక్సిన్లు ఇచ్చే బృహత్ కార్యక్రమం ప్రారంభం కానుంది. వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు 4762 ఆరోగ్య కేంద్రాల్లో వాక్సినేషన్ జరుగుతుంది. కోటికి పైగా టెస్టులు నిర్వహించి వైరస్ వ్యాప్తిని నియంత్రించడంలో రాష్ట్రం విజయం సాధించింది.” అంటూ ఆయన తన ట్విట్టర్ ద్వారా ప్రకటించారు. ఒకరకంగా ఇది ఏపీకి గుడ్ న్యూస్ అనే చెప్పాలి.

Read more RELATED
Recommended to you

Latest news