వైసీపీ నుంచి గెలిచిన ఎంపీల్లో తీవ్రమైన అసంతృప్త జ్వాలలు చెలరేగుతున్నాయి. ఇందుకు ప్రధాన కారణం ఎంపీలకు పార్టీలోనూ, ప్రభుత్వంలోనూ పెద్దగా ప్రయార్టీ లేకపోవడమే. చాలా మంది ఎంపీలు ప్రెస్‌మీట్లకు పరిమితం కావడం తప్పా చేసేదేం ఉండడం లేదు. ఇక పారిశ్రామికవేత్తలుగా ఉన్న ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసుల రెడ్డి, నెల్లూరు ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి లాంటి వాళ్లు ఎంపీ పదవిని చక్కగా వ్యాపారాలకు ఉపయోగించుకుని తమ పనులు చక్కపెట్టుకుంటున్నారని… మరి కొందరు ఢిల్లీలో లాబీయింగ్‌కు వాడుకుంటున్నారని పార్టీ వర్గాలే గుసగుసలాడుకుంటున్నాయి.
ఇక ఆ పార్టీ నరసాపురం ఎంపీ పార్టీలోనే పెద్ద తలనొప్పిగా మారిపోయారు. రఘు పార్టీ తనను సస్పెండ్ చేస్తే బీజేపీలోకి వెళ్లవచ్చన్న ఆశతో ఉంటే.. వైసీపీ మాత్రం రఘు ఎంపీ సభ్యత్వమే రద్దు చేయమని నేరుగా లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాకే ఫిర్యాదు చేసింది. ఇక తాజాగా మరో ఎంపీ సైతం ఇప్పుడు రఘురామ బాటలో ధిక్కార స్వరాలు వినిపిస్తున్నట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి. వినాయక చవితి పేజీలో కేవలం తన ఫొటోతో మాత్రమేరోజున సదరు ఎంపీ తన ఫేస్‌బుక్ శుభాకాంక్షలు చెప్పారట.
ఇందులో వైఎస్సార్ లేదా జగన్ ఫొటో లేదు. కొందరు కింద కామెంట్లు పెడితే.. మరికొందరు కీలక నేతలు దీనిపై రచ్చ జరుగుతోందని… ఇలా ఎందుకు చేశారని అడిగారట. దీంతో సదరు ఎంపీ అవునా నాకు తెలియదే… మా వాళ్లకు చెపుతానని ఫోన్ కట్ చేశారట. ఇక సదరు ఎంపీ వర్గం మాత్రం మా ఎంపీని ఈ విషయంలో ఎందుకు తప్పుపడతారని.. ముందు మీ ఎమ్మెల్యేల ఫ్లెక్సీల్లోనే జగన్, వైఎస్ ఫొటోలు ఉండడం లేదు వాళ్లనే అడగడండని ఘాటుగా సమాధానాలు ఇస్తున్నారు.
ఇక కొందరు ఎంపీలకు ఎమ్మెల్యేలు ప్రయార్టీ ఇవ్వడం లేదు.. ఎంపీ వర్గాలకు పదవులు రావడం లేదు… అసలు ఎంపీల మాట చెల్లుబాటు కానివ్వడం లేదు. సదరు ఎంపీ కూడా ఇదే పరిస్థితి ఎదుర్కొంటున్నారు. చివరకు ఆయనకు చిర్రెత్తుకొచ్చి కావాలనే ఇలా చేశారంటున్నారు. దీంతో ఇప్పుడు వైసీపీలో ఆయన మరో రఘు మాదిరిగా మారారనే అంటున్నారు.