ప్రైవేట్ స్కూళ్లకు జగన్ మార్కు హెచ్చరికలు జారీ!

-

వైఎస్ జగన్ ఏపీ ముఖమంత్రి అయినప్పటినుంచీ విద్యా వ్యవస్థపై ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ప్రైవేటు స్కూళ్ల ఆగడాలపై ఉక్కుపాదం మోపుతున్న సంగతి తెలిసిందే! ఈ క్రమంలో గతకొన్ని రోజులుగా మీడియాలోనూ, సోషల్ మీడియాలోనూ వస్తున్న వార్తల నేపథ్యంలో… జగన్ ప్రభుత్వం ప్రైవేటు స్కూళ్ల యాజమాన్యాలకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది.

ఇప్పటికే ఊర్లలో ప్రైవేటు స్కూలు యాజమాన్యాలు రోడ్లపైకి వచ్చేసి ఇళ్లముందుకు వచ్చేస్తున్నాయి. టీచర్నలు ఇంటింటికీ పంపడం, అడ్మిషన్లు జరుగుతున్నాయని పేర్లు చెప్పాలని అడగడం.. ఈ పనికోసం స్కూలు టీచింగ్, నాన్ టీంచింగ్ స్టాఫ్ పై ఒత్తిడి తేవడం జరుగుతూనే ఉంది. ఈ క్రమంలో రాష్ట్రంలో వైరస్ వ్యాప్తి తీవ్రంగా ఉన్న పరిస్థితులలో అడ్మిషన్ల కోసం టీచర్లను వేధించడం, విద్యార్థుల ఇళ్లకు పంపించడం వంటివి చేస్తే కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేస్తుంది ఏపీ సర్కార్.

తాజాగా ఏపీ పాఠశాల విద్య నియంత్రణ పర్యవేక్షణ కమిషన్ చైర్మన్ ఆర్.కాంతారావు అధ్యక్షతన జరిగిన వీడియో కాన్ఫరెన్స్ లో తీసుకున్న పలు కీలక నిర్ణయాలను సిఫార్సుల రూపంలో ప్రభుత్వానికి నివేదించారు. దీంతో.. రాష్ట్రంలో వైరస్ వేగంగా వ్యాపిస్తున్న ఈ సమయంలో ఇలాంటి చర్యలకు పాల్పడితే సంబంధిత పాఠశాలలు, కళాశాలల గుర్తింపు రద్దు చేస్తామని కమిషన్ హెచ్చరించింది.

Read more RELATED
Recommended to you

Latest news