స్నేహితుడి మరణంపై చిరంజీవి దిగ్బ్రాంతి..!

-

సూర్యాపేట చివ్వేంల మండలం కాసింపేట రోడ్డు జంక్షన్‌లో నిన్న ఉదయం జరిగిన ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. విజయవాడ నుంచి హైదరాబాద్‌ వైపు వెళ్తున్న ట్యాంకర్‌ ను కారు వెనుక నుంచి ఢీ కొట్టడంతో అక్కడికక్కడే ఇద్దరు మృతి చెందగా, మరొకరు చికిత్స పొందుతూ చనిపోయారు. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. వారిని సూర్యాపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

మృతులు విజయవాడకు చెందిన విజయకుమారి, సత్యానందం, జోసఫ్‌గా పోలీసులు గుర్తించారు. ఈ ప్రమాదంలో మృతి చెందిన సత్యానందం, మెగాస్టార్ చిరంజీవి బాల్య స్నేహితులు. నరసాపురం వైఎన్ కాలేజీలో ఇద్దరు కలిసి డిగ్రీ  చదువుకున్నారు. తరువాత చిరంజీవి సినిమా రంగంలోకి అడుగుపెట్టి ఉన్నత స్థానంకి ఎదిగారు. ఇక సత్యానందం అధ్యాపకుడిగా సెటిల్ అయ్యారు. అయినా కూడా చిరంజీవి సత్యానందంతో ఇప్పటికి మంచి స్నేహ సంబంధాలు కొనసాగిస్తున్నారు. రాజమండ్రి డిగ్రీ కాలేజీలో అధ్యాపకుడిగా చేసిన ఆయన ఉద్యోగ విరమణ చేసారు. ఆయన భార్య విజయకుమారి కూడా ఉపాధ్యాయురాలిగా పనిచేసి ఉద్యోగ విరమణ చేశారు.

అయితే విజయకుమారి అనారోగ్యంతో బాధపడుతుండడంతో చికిత్స కోసం సత్యానందం, జోసెఫ్‌ తో కలిసి కారులో నిన్న తెల్లవారుజామున విజయవాడ నుంచి హైదరాబాద్ బయలుదేరారు… మార్గమధ్యంలో సూర్యాపేట వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో వీరు ముగ్గురూ దుర్మరణం పాలయ్యారు. ఈ ఘటన గురించి తెలిసిన చిరంజీవి దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదానికి గల కారణం తెలుసుకునే ప్రయత్నం చేసినట్లు తెలుస్తుంది.

Read more RELATED
Recommended to you

Latest news