ఏపీలో వారి కోసం రూ.5000 ప్ర‌క‌టించిన జ‌గ‌న్ స‌ర్కార్‌..!!

-

ప్ర‌స్తుతం క‌రోనా టైమ్ న‌డుస్తున్న సంగ‌తి తెలిసిందే. చైనాలో పుట్టుకొచ్చిన ఈ వైర‌స్ అతి త‌క్కువ స‌మ‌యంలోనే ప్ర‌పంచ‌దేశాలు వ్యాప్తిచెంది.. ప్ర‌జ‌ల‌ను కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది. ఏపీలో సైతం క‌రోనా రోజురోజుకు ఊపందుకుంటుంది. ఇప్ప‌టికే ఏపీలో కరోనా బాధితుల సంఖ్య 329కి పెరిగింది. బుధవారం మరో 15 కొత్త కేసులు నమోదయ్యాయి. కొత్తగా నెల్లూరులో 6, కృష్ణాలో 6, చిత్తూరు జిల్లాలో మూడు కేసులు నమోదయ్యాయి. ఇదిలా ఉంటే.. కరోనా వైరస్‌ ప్రభావం పుణ్య క్షేత్రాలపై పడింది.

తిరుమల కొండ, శ్రీశైలం, శ్రీకాళహస్తి ఆలయాలు భక్తుల రద్దీ తగ్గి వెలవెలబోతున్నాయి. నిత్యం భక్తులతో కళకళలాడే అనేక పుణ్య‌క్షేత్రాలు మ‌రియు చిన్న చిన్న దేవాల‌యాలు సైతం కరోనా దెబ్బకు భ‌క్తుల లేక‌ ఖాళీగా కనిపిస్తున్నాయి. ఈ క్ర‌మంలోనే ఏపీ స‌ర్కార్ కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఇందులో భాగంగా చిన్న దేవాలయాలలో పనిచేసే అర్చకుల కోసం ఒక్కొక్కరికి రూ. 5000 గ్రాంటు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్ర‌స్తుతం క‌రోనా కార‌ణంగా దేవ‌ల‌యాలు మూత్త‌ప‌డ్డాయి.

దీంతో ముఖ్యంగా చిన్న దేవాలయాలలో అర్చకులు ఎటువంటి ఆదాయ వనరులు లేని కారణంగా వారి ఆదుకునేందుకు ముందు వ‌చ్చింది ఏపీ స‌ర్కార్‌. అయితే `ధూప దీప నైవేద్యం` మరియు `అర్చక వెల్ఫేర్ ఫండ్` ద్వారా 2800 పైగా అర్చకులకు లబ్ది చేకూరుతుంది. ఈ రెండు పథకాల్లో లేని వారు రాష్ట్ర వ్యాప్తంగా 2500 మంది వ‌ర‌కూ ఉంటారని ప్రభుత్వం అంచనాకు వచ్చింది. వారిని దృష్టిలో పెట్టుకొని జ‌గ‌న్ స‌ర్కార్.. `అర్చక వెల్ఫేర్ ఫండ్` ద్వారా ఒక్కొక్కరికి రూ. 5000 సాయం ప్ర‌క‌టించింది.

Read more RELATED
Recommended to you

Latest news