ఈరోజు పవన్ కళ్యాణ్ దివీస్ పరిశ్రమ పర్యటనకు వెళుతున్న నేపధ్యంలో ఏపీ ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది. దీవిస్ ల్యాబరేటరిస్ కు ఏపీ పరిశ్రమల శాఖ లేఖ రాసింది. స్థానికుల జీవనాధారం పై ప్రభావం చూపే ఎటువంటి వ్యర్ధాలను విడుదల చేయోద్దని ఆదేశాలు జారీ చేశారు. దివీస్ పరిశ్రమకు స్థలం ఇచ్చిన ప్రాంతంలో అనేక హ్యచరీస్ ఉన్నాయి అని పరిశ్రమల డైరెక్టర్ జేవిఎన్ సుబ్రమణ్యం పేర్కొన్నారు.
హ్యచరీస్ కారణంగా గ్రామీణ ప్రాంత యువతకు పెద్ద ఎత్తున ఉపాధి లభిస్తుంది అని లేఖలో పేర్కొన్నారు డైరెక్టర్. వ్యర్థాల కారణంగా వారు ఉపాధి కోల్పోయే అవకాశం ఉందని భావిస్తున్నట్టు పరిశ్రమల శాఖ లేఖలో తెలిపింది. కాలుష్య నివారణ చర్యలు చేపట్టకుండా ఉండడం సరికాదు అని పేర్కొన్నారు డైరెక్టర్. ఈ నేపథ్యంలో ఎటువంటి వ్యర్ధాలను విడుదల చేయోద్దు అని స్పష్టం చేస్తూ ఆదేశాలు జారీ చేశారు.