సీఆర్డీయే రద్దు బిల్లు, పాలన వికేంద్రీకరణ బిల్లులకు గవర్నర్ ఆమోదం లభించిన నేపథ్యంలో, ఏపీ సర్కారు గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. న్యాయశాఖ కార్యదర్శి గొంతు మనోహర్ రెడ్డి పేరుతో ఈ గెజిట్ విడుదల అయింది. ఈ బిల్లు ప్రకారం ఆంధ్రప్రదేశ్‌లో శాసనసభ అమరావతిలో కొలువవుతుంది. రాజ్ భవన్, సచివాలయం, హెచ్ ఓడీల కార్యాలయాలు కార్యనిర్వాహక రాజధాని విశాఖపట్నంలో ఉంటాయి. జ్యుడీషియల్ రాజధానిగా కర్నూలు ఉంటుంది. హైకోర్టు బెంచ్‌ను ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం చొరవ చూపుతుంది.
ఏ కార్యాలయాలు ఎక్కడ ఉండాలి, అందుకు కారణాలు ఏంటనే అంశాన్ని ప్రభుత్వం రాతపూర్వకంగా తెలియజేస్తుంది. అమరావతి మెట్రో పాలిటన్ రీజియన్ డెవలప్‌మెంట్ ఏరియాను శాసనరాజధానిగా పిలుస్తారు. విశాఖపట్నం మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్‌మెంట్ ఏరియాను ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ గా పిలుస్తారు. కర్నూలు అర్బన్ డెవలప్‌మెంట్ ఏరియాను జ్యూడీషియల్ క్యాపిటల్‌గా పిలుస్తారు. కాగా, సీఆర్డీయే రద్దు, వికేంద్రీకరణ చట్టాలను నోటిఫై చేస్తూ వేర్వేరుగా గెజిట్లు రూపొందించారు .