జగన్ రూ. 400 కోట్ల నిర్ణయం.. కరోనాకి కాదు!

-

విపత్తులు ఎదురొచ్చాయని సంక్షేమం పక్కన పెట్టకూడదు.. సమస్యలు అడ్డొచ్చాయని సామాన్యుడి అవసరాన్ని ఆపకూడదు.. ఇలాంటి సూత్రాలతో ముందుకు దూసుకుపోతున్నారు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్! ఒకపక్క రాష్ట్ర ఆధాయం కరోనాపాలు అవుతున్న నేపథ్యంలో.. కేంద్రం నుంచి అందుతున్న సహాయం కాస్త… చన్నీళ్లకు వేడినీళ్లలా తోడవుతున్న పరిస్థితుల్లో… సామాన్యుడికి సాయం చేసే విషయంలో వెనక్కి తగ్గేది లేదన్నట్లుగా ముందుకు అడుగేశారు వైఎస్ జగన్. దానికి సాక్ష్యమే తాజాగా విడుదల చేయాలని నిర్ణయించిన రూ. 400 కోట్లు!

 

తక్షణమే రూ. 400 కోట్లు విడుదల చేయాలని ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నిర్ణయించారు. అలా అని ఆ నిధులు కరోనా కట్టడికోసం అనుకునేరు! దానిపని దానిదే.. సామాన్యుడి మిగిలిన సమస్యలు కూడా అత్యవసరమే అని భావించిన ఏపీ ముఖ్యమంత్రి… కూలీ పనులు చేసుకునేవారు, అసంఘటిత కార్మికులు మృతి చెందితే ఆ బాధిత కుటుంబాలకు అందించే ప్రభుత్వ వాటాను తక్షణమే విడుదల చేయ నిర్ణయించారు. మాములుగా… ఈ సాయం అనేది ఎల్ఐసీ మరియు ప్రభుత్వ వాటా కలిపి సాయంగా అందించాలి. అయితే ఈ విషయంలో ఎల్ఐసీ నుంచి స్పందన కరువవ్వడంతో జగన్ ఈ నిర్ణయం తీసుకున్నారు.

ఈ విషయంలో ఎల్ఐసీ నుంచి రావాల్సిన సాయం గతేడాది నవంబర్ నుంచి పెండింగులో ఉంది… ఈ పెండింగ్ క్లైం లను ఎల్ఐసీ పరిష్కరించడం లేదు! దీంతో ప్రధాని మోడీకి జగన్ నాలుగు సార్లు లేఖ రాయడం.. ప్రధాని కూడా ఎల్ఐసీ కి లేఖ రాయడం.. అయినా కూడా ఎల్ఐసీ స్పందించకపోవడం… రెగ్యులర్ గా జరుగుతూనే ఉన్నాయి! ఈ రాజకీయాలు, ఆర్ధిక సమస్యలు ఎప్పుడూ ఉండేవే కానీ… వీటివల్ల సామాన్యుడు ఇబ్బంది పడకూడదని భావించిన జగన్… ఎల్ఐసీ వ్యవహారశైలిపై పోరాటం సాగిస్తూనే… ఈ నెల 18 నుంచి బీమాదరులకు నేరుగా నగదు అందించాలని అధికారులను ఆదేశించారు.. ఇందుకు తక్షణం రూ. 400 విడుదల చేయ నిర్ణయించారు. కరోనా చుట్టూ అన్ని సమస్యలూ తిరుగుతున్న ఈ పరిస్థితుల్లో కూడా ఇలాంటి విషయాలపై స్పందించడం అభినందనీయమని పలువురు అభిప్రాయపడుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news