వాహన దారులకు ఏపీ సర్కార్ భారీ షాక్.. రూ.5 వేలు పెంపు..

-

ఏపీ వాహనదారులకు ప్రభుత్వం భారీ షాక్ ఇచ్చింది..కొత్త వెహికల్స్ కొనేవారికి ఇది చేదువార్త అనే చెప్పాలి. సాదారణంగా కొత్త వాహానాన్ని కొనుగోలు చేస్తున్న వారికి ఇది షాకింగ్ న్యూస్ అనే చెప్పాలి.కొత్త వాహనం కొనుగోలు చేస్తే దానికి ఫ్యాన్సీ నెంబర్‌ ఉండాలని కొందరు భావిస్తుంటారు. ఎందుకంటే ఆ నెం వారి లెవల్‌ను పెంచుతుందని కొంతమంది నమ్మకం, మరి కొంతమంది మాత్రం సెంటిమెంట్ గా భావిస్తుంటారు.

అయితే ఆలా భావించే వాహనదారులకు తాజాగా ఏపీ సర్కార్ షాక్ ఇచ్చింది. వాహనాల ఫ్యాన్సీ నెంబర్ల ప్రాథమిక రుసుమును భారీగా పెంచుతున్నట్లు ఏపీ రవాణా శాఖ తాజాగా వెల్లడించింది.. ప్రస్తుతం వాహనాల ఫ్యాన్సీ నెంబర్ల కోసం దరఖాస్తు చేసుకునే వారు రూ.5 వేలు చెల్లించి వేలంలో పాల్గొనవచ్చు.

అయితే తాజాగా ఈ రుసుమును రూ.2 లక్షలకు పెంచుతూ ఏపీ రవాణా శాఖ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు మోటారు వాహనాల చట్టానికి సవరణను చేస్తూ ఏపీ రవాణా శాఖ గురువారం నోటిఫికేషన్ విడుదల చేసింది. రవాణా శాఖ తీసుకున్న ఈ నిర్ణయంతో ఫ్యాన్సీ నెంబర్లు కావాలనుకునే వారు రూ.5 వేలకు బదులుగా రూ.2 లక్షలను ముందుగా డబ్బులు చెల్లించాల్సి వస్తుంది. ప్రభుత్వ నిర్ణయం తో చాలామంది నిరాశకు గురైయ్యారు.

Read more RELATED
Recommended to you

Latest news